గూడ్స్ వాహనాలలో ప్యాసింజర్సుని తరలించరాదు

జోగులాంబ గద్వాల 12 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లాలో గత కొంతకాలం నుంచి అధిక ప్యాసింజర్ తో వాహనాలు నడుస్తున్నాయని కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి దీంతో వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు ఎంవిఐ రాములు తెలిపారు. వ్యవసాయ కూలీలను కొన్ని గూడ్స్ వాహనాలు కెపాసిటీకి మించి నడుపుతున్నారని ఈ మధ్యకాలంలో ప్రైవేటు వాహన యజమానులు డబ్బుల ఆశతో కూలీల ప్రాణాలతో చెలగాడ మారుతున్నారని, కెపాసిటీకి మించి ప్యాసింజర్ ను తీసుకపోవడం వల్ల చాలా రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి, స్థాయికి మించి ప్యాసింజర్లను తీసుకోరాదని అది చట్టరీత్యా నేరమని, ఈ మధ్యకాలంలో అధిక సంఖ్యలో గూడ్స్ వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని చాలా వాహనాలు ఫిట్నెస్ లేకుండా పర్మిషన్లు లేకుండా మరియు ఏ ఇతర డాక్యుమెంట్స్ లేకుండా వాహనాలను నడుపుతున్నారని ఇది చట్ట విరుద్ధం అని, అందుకొరకు మేము స్పెషల్ డ్రైవ్ ను పెట్టి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సరైన పత్రాలు లేని వాహనాలపై చర్యలు తీసుకుంటామని అధిక ప్యాసింజర్ తో వెళ్తున్న వాహనాలను సీజ్ చేయటానికి కూడా వెనకాడమని రవాణా శాఖ అధికారి టివి రావు ఆదేశాల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. బుధవారం సుమారు 12 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు అన్నారు.