గూడెం గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

Sep 17, 2026 - 19:22
 0  2
గూడెం గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

"చిన్నంబావిలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం 17-09-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులకు తెలంగాణ విమోచన దినోత్సవ ప్రధాన్యతను వివరించారు.

 అదేవిధంగా ఉప సర్పంచ్ శోభ, పంచాయతీ సెక్రెటరీ విక్రమ్, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడి ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, గ్రామ యువ నాయకులు గోవర్ధన్, మేఘరాజు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State