గురుకుల పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో శంకరయ్య 

Mar 19, 2025 - 19:54
 0  64
గురుకుల పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో శంకరయ్య 

అడ్డగూడూర్ 19 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా మండల పరిధిలోని మంగమ్మ గూడెం గ్రామంలో గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అడ్డగూడూరు మంగమ్మగూడెంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో వంటగదిని, ఆహార పదార్థాలను, వంట సామగ్రిని మరియు భోజనమును తనిఖీ చేసిన ఎంపీడీవో తదనంతరం హాస్టల్ గదులను తనిఖీ చేసి 10 వ తరగతి విద్యార్థులతో ముచ్చటించి, బాగా ప్రిపేర్ అయ్యి, ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. తల్లిదండ్రులకు,ఉపాధ్యాయ బృందానికి,మన అడ్డగూడూరు గురుకుల పాఠశాలకు మంచి పేరు తేవాలని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333