విద్య గుమ్మంగా ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం
మంత్రి తుమ్మల ఆదేశం
విద్యా గుమ్మంగా ఖమ్మం జిల్లా
ఖమ్మం నగరంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం
22 ఎకరాల విస్తీర్ణంలో స్కూల్ ఏర్పాటు
ఈనెల 11న స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన
అక్షయపాత్రకు భూమి ని గుర్తించాలి
మసీదులకు నిధులు మంజూరు
డంపింగ్ యార్డ్ సమస్యను సత్వరమే పరిష్కరించాలి
శానిటేషన్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి
కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం విడాలి
ల్యాండ్ మైనింగ్, గంజాయి
అక్రమాలను అరికట్టాలి సమావేశంలో కలెక్టర్, సీపీలకు మంత్రి తుమ్మల ఆదేశం
విద్యా గుమ్మం ఖమ్మం జిల్లా అని, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని చదువుల కేంద్రంగా ఖమ్మం జిల్లాను తీర్చిదిద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ శంకుస్థాపనకు సర్వసిద్ధం చేయాలని ఆదేశించారు. 22ఎకరాలలో ....లక్షల వ్యయంతో స్కూల్ నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. తక్షణమే భూమిని గుర్తించి తగు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈనెల 11వ తేదీన స్కూల్ శంకుస్థాపనకు కార్యక్రమం నిర్వహించాలన్నారు.. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు అవసరమైన 22 భూమిని రఘునాథపాలెం మండలం జింకలతండా వద్ద గుర్తించినట్లు కలెక్టర్ మంత్రి వివరించారు. నియోజకవర్గంలోని 50 మసీద్‌లకు రూ.50లక్షల నిధులు తక్షణమే కేటాయించాలన్నారు. అక్షయపాత్రకు సంబంధించి త్వరితగతిన భూమిని గుర్తించాలన్నారు. అక్షయపాత్ర బాధ్యులతో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. డంపింగ్ యార్డ్ సమస్యను అధిగమించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. కెఎంసీలో శానిటేషన్ సమస్య లేకుండా చూడాలని తగు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. అధికారులంతా హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలన్నారు. కిందిస్థాయి సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి అధికారం యంత్రాంగం కృషి చేయాలన్నారు. జిల్లాలో మైనింగ్, గంజాయి అక్రమార్కులపై ఉక్కు పాదం మోపాలని జిల్లా ఎస్పీ సునీల్ దత్తుకు సూచించారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల రక్షణ మన కర్తవ్యం అన్నారు. ప్రజలను ఇబ్బందులు గురి చేసే వారిని వదిలిపెట్టి ప్రసక్తే లేదన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు.