గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Jun 21, 2026 - 18:09
 0  2
గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే విడుదల చేయాలి..

తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్....

గీత కార్మికుల పెన్షన్ ఎక్స్గ్రేషియా, లైసెన్స్ సొసైటీల సమస్యలు జూలై లోపు పరిష్కరించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ధర్మభిక్షo భవనంలో సంఘం సభ్యత్వం నమోదు కార్యక్రమాని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బొమ్మగాని ధర్మ బిక్షం నేతృత్వంలో అనేక పోరాటాలు చేసి పెన్షన్, లైసెన్స్, ఎక్స్గ్రేషన్లు సాధించుకున్నామని అది ధర్మభిక్షం పోరాట ఫలితమైన అని కొనియాడారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించకుండా కాలయాపన చేస్తూ గీత కార్మికులపై సవితి తల్లి ప్రేమను చూపిస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వారికి రావాల్సిన 10 కోట్ల రూపాయలు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన హెచ్చరించారు. పెన్షన్ పొందుతున్న గీత కార్మికుడు చనిపోతే ఆ పెన్షన్ ఇతర పెన్షన్ల మాదిరిగా భార్యకు వచ్చేటట్లు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం రేగటి లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కోఆర్డినేటింగ్ సెక్రెటరీ బొమ్మగాని నాగభూషణం, జిల్లా గౌరవ అధ్యక్షులు బొమ్మగాని శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ కోటయ్య, మాజీ కౌన్సిలర్ అనంతుల మల్లేశ్వరి, నియోజకవర్గ కార్యదర్శి బండారం లక్ష్మయ్య, తొట్ల ప్రభాకర్, బూర వెంకటేశ్వర్లు, తొట్ల వెంకన్న, బూర సైదులు, రేగటి సాంబయ్య, పందుల జానయ్య, ఎడెల్లి శ్రీకాంత్, అయితే గాని కామేష్, రెడ్డి మల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333