గట్టిసింగారం గ్రామంలో ముందుగానే అంబేద్కర్ జయంతి వేడుక
పూలమాలలు వేసి నివాళులర్పించిన విద్యార్థులు
అడ్డగూడూరు 13 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామంలో అఖిల భారతీయ విద్యార్థిపరిషత్ (ఏబివిపి)ఆధ్వర్యంలో గట్టుసింగారం ప్రాథమిక పాఠశాలలో భారత రాజ్యాంగ రూపశిల్పి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, న్యాయ శాస్త్రవేత్త, ప్రజాస్వామ్య పరిరక్షకుడు,సంఘసంస్కర్త, భారతరత్న డ్రా. బాబాసాహెబ్ భీంరావ్ రాంజీ 133వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్లకొండ.వేణు పాల్గొని స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవారు కాదు అందరివాడు అని,ఆయన బడుగు బలయిన వర్గాల కోసం కృషి చేసిన వ్యక్తి, అణగారిన భారతదేశన్ని ప్రపంచంల…
ఎల్లేష్ పార్దివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మండల యువజన బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లింగాల అశోక్ గౌడ్
అడ్డగూడూరు 13 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల పరిధిలోని అజింపేట గ్రామానికి చెందిన లింగాల యల్లేష్ గౌడ్ అనారోగ్యం కారణంతో మరణించడం జరిగింది. వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించరు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అడ్డగుడూరు బీఆర్ఎస్ మండల పార్టీ యువజన అధ్యక్షులు లింగాల అశోక్ గౌడ్ వారితో పాటు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొమ్మగాని ప్రవళిక మల్లేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కన్నెబోయిన ఎలందర్ యాదవ్,మాజీ వార్డ్ మెంబెర్ లింగాల వెంకన్న, బిఆర్ఎస్ గ్రామశాఖ ఎస్సీసెల్ అధ్యక్షులు ఇటికాల అంజయ్య,బీఆర్ఎస్ పార్టీ నాయకులు లింగాల భూషలు,ఇటికాల పరుశరాములు, దినేష్, లింగాల మధు గౌడ్, కుమార్ గౌడ్,సత్యనారాయణ,వెంకన్న, నర్సింహా గ్రామస్తులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
అన్నా నమస్కారం రెండు లింకులు ఉన్నాయి పంపియ్యవా అన్న
శాలిగౌరారం ప్రాజెక్టు నీటి ప్రాంతాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
శాలిగౌరారం 13 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో ప్రాజెక్టు తీర ప్రాంతాన్ని పరిశీలించారు. పల్లివాడ, సురారంతో పాటు కాలువ తీరా ప్రాంతాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు శనివారం పరిశీలించారు. శాలిగౌరారం ప్రాజెక్టులోని పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించేందుకు అధికారులు ప్రత్యేక తీసుకొని రైతులకు నీటిని అందించే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. చెరువులోకి నీరు సాఫీగా వచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులకు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చాడ సురేష్ రెడ్డి ,చామల మహేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి,గోదల వెంకట్ రెడ్డి,మద్ది వెంకట్ రెడ్డి, ఎస్.కె జహంగీర్, పడాల సైదులు, జమ్మూ అశోక్, పడాల వెంకన్న లింగస్వామి తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే శ్రీహరిని కలిసి ఎంపీ అభ్యర్థురాలు డాక్టర్" కడియం కావ్యకు మద్దతు తెలిపిన రాష్ట్ర బైండ్ల సంఘం
వరంగల్ 15 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ "కడియం కావ్యకు మద్దతు తెలియజేస్తున్నట్లు బైండ్ల సంఘం రాష్ట్ర కమిటీ ప్రకటించింది. అన్మకొండలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో అన్ని రాజకీయ పార్టీల బైండ్ల సంఘం ప్రతినిధులు కలిసి తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏదుల్ల గౌరీశంకర్ ప్రకటించారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో సుమారు 30వేల పై చిలుకు ఓట్లు కడియం కావ్యకు మూకుమ్మడిగా వేయుంచి వారి గెలుపుకు కృషి చేస్తామని ఈ సందర్బంగా తెలియజేశారు. మాదిగ సామాజిక వర్గానికి తరతరాల నుండి పౌరోహిత్యం మంచి చెడు కార్యక్రమాలన్నీ చేస్తూ స్నేహపూర్వంగా కలిసిమెలిసి జీవిస్తున్న తరుణంలో..బైండ్ల సామాజిక వర్గాన్ని కించపరుస్తూ, ఉపకులాల అభివృద్ధిని జీర్ణించుకోలేక మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు చిట్టంపల్లి శ్రీనివాస్ రావు, ఇంద్రపల్లి వెంకటేశం, రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఏర్పుల భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏర్పుల గాలయ్య, రాష్ట్ర కార్యదర్శులు ఇంద్రపల్లి సంజీవ, బీజ్ఞపల్లి రవి, ఉప్పునూతల నర్సింగ్ రావు, మారపాక సుధాకర్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు దేశపక నగేష్ జనగామ జిల్లా అధ్యక్షులు మారపాక మనోహర్, వనపర్తి జిల్లా అధ్యక్షులు కోడిగంటి రామ్ చందర్, నాయకులు బరుపట్ల శ్రీనివాస్, ఇంద్రపల్లి రాజేందర్, గంగుల శ్రీనివాస్, ఇంద్రపల్లి రమేష్, జీలుకర రంజిత్, కడియం సురేష్ , కడెం రవివర్మ , కడెం చంద్రమౌళి, చినపాక మురళి, వెంకన్న,కడియం బాలకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి ఎమ్మెల్యేను మర్యాదపూర్వం కలిసిన ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న
అడ్డగూడూరు16 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-
తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న సోమవారం రోజు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో చేరిన ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న తుంగతుర్తి ఎమ్మెల్యేల మందుల సామేల్ ను మంగళవారం రోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ప్రజా గాయకుడు మాట్లాడుతూ.. అన్నా మనకు వచ్చిన అవకాశాన్ని మన తుంగతుర్తి నియోజకవర్గంని అభివృద్ధి చేయడమే మన ధ్యేయంగా..పార్టీ కార్యకర్తలకు గ్రామ గ్రామాన బీద ప్రజలకు న్యాయం చేయాలంటూ ఏది ఏమైనా మన తుంగతుర్తి పోరు గడ్డను అభివృద్ధి పదంలో మారోజు వీరన్న ఒక చరిత్రకారుడుగా ఎలా నిలిచాడో ..ఆ చరిత్రగా తుంగతుర్తి గడ్డను అభివృద్ధి పదంలో అలా మార్చాలంటూ.. ఏపూరి సోమన్న అన్నారు. ఏది ఏమైనా మూడు జిల్లాలతో కూడుకున్న తుంగతుర్తి నియోజకవర్గని అభివృద్ధి పదములో నడవడమే మన ధ్యేయమని అన్నారు.