లోక్ సభ  ఎన్నికల కోడ్ లో బాగంగా  మద్యం, డబ్బు అక్రమ రవాణా పై నిఘా ఉంచాలి

Apr 16, 2024 - 20:04
 0  5
లోక్ సభ  ఎన్నికల కోడ్ లో బాగంగా  మద్యం, డబ్బు అక్రమ రవాణా పై నిఘా ఉంచాలి
లోక్ సభ  ఎన్నికల కోడ్ లో బాగంగా  మద్యం, డబ్బు అక్రమ రవాణా పై నిఘా ఉంచాలి

నమోదు అయిన ప్రతి కేసులో  సాక్ష్యాలను సేకరించి పారదర్శకంగా విచారణ చేపట్టాలి   

గ్రామాలలో విజిబుల్ పోలీసింగ్ పెంచి అవసరమైన సమచారం సేకరించాలి

నెలవారీ నేర సమీక్షా సమావేశంలో------జిల్లా ఎస్పీ  రితిరాజ్,IPS

జోగులాంబ గద్వాల 16 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-   పార్లమెంట్ ఎన్నికల కోడ్ లో బాగంగా జిల్లా లో , సరిహద్దులో  మధ్యం, నగదు  అక్రమ రవాణా పై నిఘా ఉంచి పట్టుకోవాలని, ఆయా పోలీస్ స్టేషన్ లలో నమోదు అయిన ప్రతి కేసుల్లో సాక్ష్యాలను సేకరించి  పకడ్బందీ గా విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీ రితిరాజ్,IPS  పోలీస్ అధికారులను ఆదేశించారు.


ఈ రోజు జిల్లా పోలీస్  కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా పోలీస్ అధికారులతో సర్కిల్ వారి గా జిల్లా ఎస్పీ  నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేర సమీక్ష లో ఆయా పోలీస్ స్టేషన్ లలో నమోదు అయిన కేసులలో అరెస్ట్ పెండింగ్ కు గల కారణాలను  తెలుసుకొని, అవసరమైన  చర్యలు చేపట్టి  అరెస్టు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. నమోదు అయిన కేసులలో కొన్ని కేసులు ఇంకా UI లో ఉండటానికి గల కారణాలను పరిశీలించారు. UI కేసులకు అవసరమైన DNA ,FSL, మెడికల్ రిపోర్ట్స్ ను పెండింగ్ ఉంచకుండా వెంటనే తీపించుకొని కోర్టు లో చార్జీ షీట్ వేయాలని సూచించారు.  కేసులలో విచారణలో అవసరమైన క్లూస్ ను,ప్రతి సాక్ష్యాన్ని సేకరించాలని ఆదేశించారు. కేసుల విచారణకు సంబందించి ప్రతి అంశం పేపర్ లో పొందుపరచి రికార్డు చేసి ఉండాలని అన్నారు. మిస్సింగ్, ప్రాపర్టీ ,రోడ్డు ప్రమాదాల కేసుల ఫైల్స్ ను పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు . పోలీస్ స్టేషన్ ల వారిగా ప్రతి కేసు ఫైల్ ను పరిశీలించి వాటికి అవసరమైన క్లూస్ ను సేకరించుట, రిపోర్ట్ లు పెండింగ్ లేకుండా తెచ్చుకొనుట గురించి, స్టేషన్ రికార్డ్స్ అప్డేట్ చేయుట గురించి తగు సూచనలు చేశారు. 

     ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ  రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల సంఘం సూచనల ప్రకారం బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలియజేసారు. జిల్లాలో మరియు జిల్లా సరి హద్దులో మధ్యం, నగదు అక్రమ రవాణా జరుగకుండా పకడ్బందీ నిఘా ఉంచి పట్టుకోవాలని, చెక్ పోస్టు లలో నిరంతర తనిఖిలు చేయడం తో పాటు నది తీరా ప్రాంతాలలో బ్లూ కోల్ట్ సిబ్బంది తో నిఘా పెంచాలని ఆదేశించారు.  సరైన ఆధారాలు లేకుండా ఎవరైనా పరిమితికి మించి నగదును రవాణా చేస్తూ పట్టుబడితే ఎన్నికల నియమావళి ప్రకారం కేసుల నమోదు చేసి సీజ్ చేసిన నగదును డిస్ట్రిక్ట్ రిడ్రీసల్ కమిటీకి అప్పగించాలని తెలిపారు.
ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో భరోసా కల్పించే విధంగా పనిచేయాలని తెలిపారు. గ్రామాలలో సిబ్బంది రెండు రోజులకు ఒక సారి తిరుగుతూ గ్రామ సమచారం తో పాటు అక్రమ రవాణ పై నిఘా ఉంచాలని అన్నారు.
  నేర నియంత్రణకు, నేర చేదనకు ఎంతగానో ఉపయోగ పడే CC సిమారాలను నేను సైతం,కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా వాటి ప్రాముఖ్యతను తెలియజేసి గ్రామాలలో, పట్టణ కాలనీలలో ప్రజలతో అవగాహనా కార్యక్రమాలు చేపట్టి వాటి నీ ఏర్పాటు చేసుకునే విదంగా ప్రజలను ప్రోత్సహించాలని అన్నారు. అలాగే బాల్య వివాహాలు, సైబర్ నేరాలు , డ్రగ్స్ మరియు ఎలోప్మెంట్ కేసులపై  కమ్యూనిటీ ప్రోగ్రామ్ లు  నిర్వహిoచి ప్రజలను చైతన్యం చేయలని అన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి 
 ఫ్రిజ్ అయిన ఖాతాలలో ఉన్న నగదును పుట్ ఆన్ హోల్డ్ లో ఉంచి   కోర్టు అనుమతీ ద్వారా భాదితులకు అందజేయలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్ లో ఎంట్రీ చేయలని, రోజు వారిగా సిబ్బంది విధులను రికార్డ్ చేసే జనరల్ డైరీ ను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ప్రాపర్టీ కేసుల చేదనకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని , వాటికి అవసరమైన అన్ని రకాల క్లూస్ ను సేకరించి త్వరగా చేసించాలని అన్నారు. 

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి--- జిల్లా ఎస్పీ

తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో అధ్వర్యంలో గంజాయి మరియు కల్తీ కల్లు వినియోగం వల్ల జరిగే అనర్థాలపై రూపోందిన వాల్‌ పోస్టర్‌ను జిల్లా పోలీస్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ  అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
 రాష్ట్రంలో గంజాయితో పాటు కల్తీ కల్లు వినియోగం ద్వారా వ్యక్తులతో పాటు సమాజానికి జరిగే నష్టాన్ని తెలిపే విధంగా రూపోందించిన ఈ వాల్‌ పోస్టర్‌లో గంజాయి, కల్తీ కల్లు విక్రయాలకు పాల్పడితే ఫిర్యాదు చేయాల్సిన టోల్‌ ఫ్రీ నంబర్‌తో ఈ అవగాహన పోస్టర్లను రూపోందించడం జరిగింది.

     ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను అరికట్టడం లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని, గంజాయికి బానిసలుగా మారి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకొంటుందని దాని వలన వారి జీవితాలు విచ్చిన్నం కావడంతో పాటు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురైవుతున్నారని, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలందరు స్వచ్చందంగా ముందుకు వచ్చి గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా వుంచబడుతాయని, గంజాయి రహిత జిల్లా కోసం అధికారులు, సిబ్బంది కృషి చేయాలనీ ఎస్పీ  సూచించారు. ఈ సమావేశంలో  డి.ఎస్పీ కె.సత్యనారాయణ , సైబర్ సెక్యూరిటీ బ్యూరో డి.ఎస్పీ సత్తయ్య , గద్వాల్, ఆలంపూర్ మరియు శాంతి నగర్ సి. ఐ లు భీమ్ కుమార్, రవి బాబు, కె. ఎస్. రత్నం, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు , డిసి ఆర్బి, ఐటీ, విభాగాల ఎస్సై లు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333