ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీజ కు వినతి పత్రం*

Mar 17, 2025 - 19:41
Mar 17, 2025 - 21:02
 0  5
ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీజ కు వినతి పత్రం*

ఖమ్మం,17 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- ఖమ్మం : రాష్ట్ర లో ఏ జిల్లాలో లేని నిబంధనలను ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ అమలు చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది . ఇన్సూరెన్స్ పేపర్ ఉండగా ఈమెయిల్ పెట్టాలని , రవాణా శాఖలో లైసెన్సుల కోసం వాహన పత్రాల కోసం వెళితే ఆధార్ కార్డు ఉండగా ఈ ఆధార్ కార్డు తీసుకురావాలని , ఫైనాన్స్ క్లియరెన్స్ ఉండగా కొద్ది రోజుల సమయం దాటితే కొత్తది తేవాలని , ట్రాన్స్పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వైరా సత్తుపల్లి ఆఫీసుల్లో ఆర్టీవో సంతకం కావాలని అలాగే అనేక సమస్యలు రవాణా కార్యాలయంలో ఉంటున్నాయి ఇటు ప్రజలు డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని (AIRTWF-CITU) జిల్లా కార్యనిర్వాక అధ్యక్షులు వై విక్రమ్, ప్రధాన కార్యదర్శి జిల్లా ఉపేందర్ , ఉపాధ్యక్షులు ధరావత్ రాందాస్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు . జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రవాణా శాఖ అధికారికి వచ్చిన దరఖాస్తును పంపిస్తూ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333