ఖమ్మం జిల్లావాసి కేదాసు జగన్మోహన్రావుకు డాక్టరేట్ 

Aug 21, 2026 - 00:19
 0  1
ఖమ్మం జిల్లావాసి కేదాసు జగన్మోహన్రావుకు డాక్టరేట్ 
ఖమ్మం జిల్లావాసి కేదాసు జగన్మోహన్రావుకు డాక్టరేట్ 

ఖమ్మం నగరానికి చెందిన కేదాసు జగన్మోహన్ రావుకు తమిళనాడుకు చెందిన అన్నామలై యూనివర్సిటీ , బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డాక్టరేటు ప్రధానం చేసింది . 'ఎంప్లాయి ఆటిట్యూడ్ ఆన్ ఆర్గనైజేషనల్ క్లైమేట్ ఇన్ గ్రానైట్ ఇండస్ట్రీ, తెలంగాణ' అనే అంశంపై ఆయన సమర్పించిన పరిశోధన గ్రంధానికి విశ్వవిద్యాలయం ఈ డాక్టరేట్ అందజేసింది . ఖమ్మం బురహానపురం వాసి అయిన జగన్ మోహన్రావు గతంలో వివిధ మైనింగ్ కంపెనీలలో 10 సం॥లకు పైగా కంపిటెంట్ మైనింగ్ మేనేజర్ గా పనిచేసి , పరిశోధన మీద ఇష్టంతో యం.బి.ఏ చేసి తర్వాత హ్యూమన్ రిసోర్స్ డిపార్టుమెంట్ నుండి పి. హెచ్. డి పూర్తిచేసినారు . తెలంగాణలోని ఎంపికచేసిన గ్రానైట్ పరిశ్రమల్లో ఉద్యోగుల వైఖిరి , సంస్థాగత వాతావరణం మరియు ఉద్యోగ సంతృప్తి తదితర అంశాలను ఈ పరిశోధనలో అధ్యయనం చేశారు . ప్రస్తుతం పరిశోధన రంగంలో ఫ్రీలాన్సర్గా వివిధ విశ్వవిద్యాలయాలలో పలు పరిశోధనలకు తన సహకారం అందిస్తున్నారు . ఈ డాక్టరేట్ సాధన కేదాసు జగన్ మోహన్ రావు విద్యా , పరిశోధనా రంగంలో సాధించిన ముఖ్యమైన విజయంగా నిలిచింది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333