క్విజ్ పోటీలో మోడల్ స్కూల్ విద్యార్థులకు అవార్డులు లభ్యం
తిరుమలగిరి 01 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
జిల్లా స్థాయి పీ ఎమ్ శ్రీ పాఠశాల ల విద్యార్థుల క్విజ్, స్పెల్ బీ, మాక్ పార్లమెంట్ పోటీలు, సూర్య పేట కలెక్టరెట్ లో జిల్లా సోషల్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.. మోడల్ స్కూల్ అనంతారం విద్యార్థులు, జె భార్గవ్ ప్రధాన మంత్రి పాత్ర పోషించి, బెస్ట్ పెర్ఫార్మర్ గా ఎంపిక అయ్యాడు, మరియు క్విజ్ పోటీలో చర్విత రెడ్డి.. ఎనమిదవ తరగతి ద్వితీయ ఎంపికయ్యారు దీంతో విద్యార్థులకు అడిషనల్ కలెక్టర్ లు బహుమతులు ప్రశంసా పత్రాలు అందించారు. విద్యార్థులకు అవార్డు లభించడంతో పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తిరుమలగిరి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు