శాసనసభ సభాపతి పదవికి వన్నెతెచ్చిన మహానీయుడు  దుద్దిళ్ళ శ్రీపాదరావు

Mar 2, 2026 - 19:39
 0  0
శాసనసభ సభాపతి పదవికి వన్నెతెచ్చిన మహానీయుడు  దుద్దిళ్ళ శ్రీపాదరావు

 శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ 

 జోగులాంబ గద్వాల 2మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఘనంగా నివాళులు అర్పించారు.

సోమవారం ఐడిఓసి ఆవరణలో  శ్రీపాదరావు జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఇతర అధికారులతో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  శ్రీపాద రావు  ప్రజాసేవకు అంకితమై, శాసనసభ స్పీకర్‌గా విశేష సేవలు అందించారని కొనియాడారు. సభ గౌరవ, మర్యాదలను కాపాడటంలో కీలకపాత్ర పోషించారన్నారు. శ్రీపాద రావు ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవకు అంకితభావంతో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.  రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించడం గౌరవ కరమైన విషయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆర్డిఓ శ్రీనివాస రావు, కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి, పలువురు జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333