కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బందితో సమావేశం
- కేసుల్లో నేరస్తులకు త్వరగా శిక్షలు పడేలా కృషి చేయాలి
- ..... సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్.
జిల్లాలోని పోలీస్ స్టేషన్ల నుండి కోర్టు విధుల పర్యవేక్షణ కోసం పనిచేస్తున్న కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బందికి ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ కోర్టు విధుల నిర్వహణకు సంబంధించి సలహాలు సూచనలు అందించారు, పనిలో నాణ్యత, పారదర్శకత ఉండాలని అని అన్నారు, పెండింగ్ ఉండకుండా పని చేయాలి, కోర్టు వారెంట్, సమన్ లు సకాలంలో అందజేయాలి, సిబ్బంది కోర్టులలో సమన్వయంగా, సమయపాలనతో పనిచేయాలని, ఎప్పటికప్పుడు కేసుల స్థితిగతులను రికార్డులలో, అంతర్జాలంలో నమోదు చేసుకోవాలని సూచించారు. బాధితులను, సాక్షులను, నిందితులను సకాలంలో కోర్టులకు ప్రవేశపెట్టి కేసులు పరిష్కారం అయ్యేలా పనిచేయాలని సూచించారు. కేసుల్లో త్వరితగతిన నేరస్తులకు శిక్షలు అమలు అయితేనే క్షేత్రస్థాయిలో నేరాలను అదుపు చేయవచ్చు అని సూచించారు. లక్ష్యంతో పని చేయాలని కోర్టు అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశం నందు అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిసిఆర్బి డిఎస్పి రవి, ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, కోర్టు డ్యూటీ పోలీస్ సిబ్బంది ఉన్నారు