మండల స్థాయి ప్రజావాణిలో 5 దరఖాస్తులు స్వీకరణ ఎంపీడీవో
జోగులాంబ గద్వాల 17 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల . తెలంగాణ రాష్ట్రంప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పరిషత్ కార్యాలయము నందు ఎంపీడీవో రామాదేవి ఆధ్వర్యంలో మండల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వివిధ సమస్యల దరఖాస్తులను స్వీకరించారు. మండల స్థాయిలోనే ప్రజల సమస్యలను అధికారులు స్వీకరించి, వాటిని సంబంధిత శాఖల ద్వారా సత్వరం పరిష్కరించేలా చర్యలు ఉంటాయని ఎంపీడీవో తెలిపారు. మొత్తం ఫిర్యాదులు 05 రెండో రెవెన్యూ, ఒకటి ఏఈ పి ఆర్,ఒకటి ఆర్ అండ్ బి, ఒకటి ఏఈ ఎలక్ట్రికల్, ఫిర్యాదులు అందాయని ఎంపీడీవో వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి, ఎం పి ఓ, ఏవో రవికుమార్, ఐసిడిఎస్ సూపర్వైజర్ పరమేశ్వరి, ఏపిఎం పద్మ, ఎపిఓ,హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ నాగచంద్రమ్మ,ఎంఈఓ వెంకటేశ్వర్లు,ఎలక్ట్రికల్ ఏఈ శేఖర్, వెటర్నరీ సూపర్వైజర్, తదితరులు పాల్గొన్నారు.