పాట ప్రజల హక్కుల పరిరక్షణకు గొంతుక కావాలి

-TUWJ రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ 

Aug 18, 2026 - 18:43
Aug 18, 2026 - 19:13
 0  2
పాట ప్రజల హక్కుల పరిరక్షణకు గొంతుక కావాలి
పాట ప్రజల హక్కుల పరిరక్షణకు గొంతుక కావాలి

బషీర్ బాగ్,  19 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- పాట కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, అది సమాజాన్ని మేల్కొలపాలని,  ప్రజల హక్కుల పరిరక్షణకు గొంతుక కావాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ అన్నారు. "విశ్వజన కళామండలి" సాంస్కృతిక సంస్థకు యాభై యేండ్లు నిండిన సందర్భంలో, సెప్టెంబర్ లో జరిగే స్వర్ణోత్సవాల పోస్టర్ ను, ఇవ్వాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్  ఆడిటోరియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని విరాహత్ అలీ ప్రసంగించారు. యాభై యేండ్ల క్రితం మాస్టార్జీ నెలకొల్పిన దళిత కళామండలి, నేడు విశ్వజన కళామండలిగా రూపాంతరం చెంది, దేశవ్యాప్తంగా విస్తరించడం హర్షనీయమన్నారు. మాస్టార్జీతో, ఈ సంస్థతో తనకు ముప్పై యేండ్ల బంధం ఉందని ఆయన తెలిపారు. సమాజంలో అణగారిన వర్గాల కష్టాలు, అవమానాలు, వివక్ష గురించి మాట్లాడటానికి అనేక ఆంక్షలు ఉన్న రోజుల్లో, మాస్టార్జీ పాటను ప్రజల గొంతుకగా మార్చి, పల్లె పల్లెనా సాంస్కృతిక ఉద్యమం చేసారని విరాహత్ అలీ గుర్తుచేసారు. విశ్వజన కళామండలి కేవలం ఒక కళా సంస్థ మాత్రమే కాదని, అది దళితుల ఆత్మగౌరవానికి వేదికగా, సామాజిక న్యాయానికి గొంతుకగా, అంబేడ్కర్ ఆలోచనలకు ప్రచార వేదికగా, అణగారిన ప్రజల చైతన్యానికి ఒక సాంస్కృతిక ఉద్యమంగా తన కార్యకలాపాలను కొనసాగించిందని ఆయన కొనియాడారు. మాస్టార్జీ రచించిన “అందుకో దండాలు… బాబా అంబేడ్కరా"  గీతం దేశవ్యాప్తంగా ప్రాచూర్యం పొంది, ప్రజల్లో ఎనలేని చైతన్యాన్ని కలిగించిందన్నారు. జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే, బుద్ధుడు, పెరియార్ వంటి సామాజిక సంస్కర్తల ఆలోచనలను కూడా విశ్వజన కళామండలి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన తెలిపారు.  కారంచేడు నుంచి చుండూరు వరకు దళితులపై జరిగిన అనేక దాడులపై కళామండలి స్పందించి, బాధితుల బాధను, ఆవేదనను, ఆగ్రహాన్ని పాటగా మలచి సాంస్కృతిక పోరు నిర్వహించించడం అభినందనీయమని విరాహత్ అలీ కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో విశ్వజన కళామండలి వ్యవస్థాపకులు మాస్టార్జి,  స్వర్ణోత్సవాల కమిటీ చైర్మన్ జే.బి.రాజు, విశ్వజన కళామండలి గౌరవ సలహాదారులు తలకొక్కుల రాజు, బీసీ ఉద్యమ నాయకులు నారగోని వెంకటయ్య, దళిత ఉద్యమ నాయకులు నల్ల సూర్యప్రకాష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333