కృష్ణవేణి విగ్రహం ఎక్కడ..?
జోగులాంబ గద్వాల 7 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తాలో కృష్ణవేణి విగ్రహం కనిపించకుండా ఒక ప్రైవేటు పాఠశాల బ్యానర్ ఏర్పాటు చేయడంతో విగ్రహం కనిపించడం లేదు. పట్టణంలోని పలు విగ్రహాలు స్మారకార్థం ఉండగా వాటికి అడ్డంగా బ్యానర్లు ఏర్పాటు చేయడం పట్ల మున్సిపల్ అధికారుల తీరుపై ప్రజలు విమర్శిస్తున్నారు.? ఇప్పటికైనా సంబంధిత అధికారులు బ్యానర్లు తీసి విగ్రహాలుకనిపించే విధంగా చర్యలు తీసుకోవాలని పట్టణంలోని ప్రజలు మరియు జిల్లా ప్రజలు కోరుతున్నారు.