కృష్ణవేణి ఫౌండేషన్ సేవలు అభినందనీయం
తిరుమల గిరి మెగా వైద్య శిబిరం విజయవంతం
తిరుమలగిరి 27 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరిలోసింధు హాస్పిటల్ హైటెక్ సిటీ కృష్ణ వేణి ఫౌండేషన్ శంకరయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన హెల్త్ క్యాంప్ కు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని సింధు వైద్యశాల వైద్యుల బృందం తెలిపారు . కృష్ణవేణి ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ రక్షణ సేన తుంగతుర్తి నియోజక వర్గ ఇంచార్జి సూరారపు కృష్ణవేణి ఆధ్వర్యంలో సింధు హాస్పిటల్ హైటెక్ సిటీ వారి సహకారం తో,శంకరయ్య విజ్ఞాన కేంద్రం తో కలిసి జరిపిన హెల్త్ క్యాంప్ లో వైద్యుల బృందం క్యాన్సర్, కార్డియాక్, గైనిక్ తదితర సమస్యలతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించమని 150 మంది కి పైగా ప్రజలు వైద్య పరీక్షల కు హాజరు కావడం జరిగిందని అన్నారు. వారందరికీ అన్ని పరీక్షలు పూర్తి చేసినమని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే సింధు వైద్యశాల హైదరాబాద్ వారిని సంప్రదించాలని ఇంత మంచి అవకాశాన్ని పేద ప్రజలకు చేరువ చెయ్యడంలో కృష్ణవేణి ఫౌండేషన్ ముందు ఉండడం ఆనందానీయమని వారు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు కోటిరెడ్డి, హానిష, శ్రీ రామ్ మార్కెటింగ్ మేనేజర్ విజయ్, పోరెళ్ళ విప్లవ్ కుమార్, నాగులగాని హరీష్, వినయ్ ,సంపత్ , భాషామల్లా సైదులు భవాని, రజిత ముద్రబోయిన అనిల్ఉమ తదితరులు పాల్గొన్నారు...