తిరుమలగిరి మండల స్వర్ణకార నూతన కమిటీ ఎన్నిక
తిరుమలగిరి 10 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మండల స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు.సంఘంలోని ముఖ్యమైన పదవులైన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పోస్టులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే రావడంతో, అభ్యర్థులను ఏకగ్రీవంగా ఖరారు చేసినట్లు కమిటీ వెల్లడించింది. నూతన కార్యవర్గ వివరాలు: అధ్యక్షులు:తల్లోజు శ్రీనివాచారి జనరల్ సెక్రటరీ (ప్రధాన కార్యదర్శి):మాచర్ల నాగాచారి కోశాధికారి కత్రోజు లక్ష్మణాచారి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ స్వర్ణకార సంఘానికి అన్ని విధాల తోడు ఉంటానని అలాగే ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షులు తొగటి మురళి, రాష్ట్ర స్వర్ణకార సంఘ కార్యదర్శి నారాయణదాసు రామాచారి రాష్ట్ర స్వర్ణకార ఆర్గనైజింగ్ సెక్రటరీ బానాల శ్రీనివాసు సమక్షంలో పారదర్శకంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షులు మారోజు ఈశ్వరాచారి, మల్లికార్జున చారి, పోలోజు విజయ్ కుమార్, తొగటి యాదగిరి చారి, కందుకూరి శ్రీనివాచారి, మాచర్ల శ్రీనివాచారి, అరుణ్, దిలీప్, రాధాకృష్ణ, సాయి రాజు తదితర సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.