కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి
పసిబిడ్డ హంతకులపై కేసు నమోదు చేయాలి
తల్లమల్లహసేన్
మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఫిబ్రవరి 18వ తేదీన జరిగిన మల్లన్న జాతరలో సిలికేశ్వరం గణేష్ తల్లి చంద్రకళ భార్య మౌనిక అక్క కీర్తి దేవుని దర్శనం కోసం వెళ్లారు వీరిని కులం పేరుతో దూషించి దౌర్జన్య దాడి చేసి గణేష్ కూతురు రెండు నెలల పసిపాప బిడ్డను ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులైన ఉంద్యాల శ్రీనివాసరెడ్డి సంఘం మధుసూదన్ రెడ్డి గొంది శ్రీకాంత్ రెడ్డి సంగం విష్ణువర్ధన్ రెడ్డి గొంది శ్రీకాంత్ రెడ్డి కటికే నరేష్ కంకణాల సతీష్ రెడ్డి కంకణాల తుకారాం రెడ్డి లు కంకణాల మదన్ రెడ్డి కులం పేరుతో దూషించి దౌర్జన్యంగా దాడి చేసి మానవ మృగాల ప్రవర్తించి రెండు నెలల పసిబిడ్డను హత్య చేశారు. మహిళలు అని చూడకుండా నానా బూతులు తిట్టి అవమానించారు. ఇదేమిటని సోషల్ మీడియాలో ప్రశ్నించిన సిలికేశ్వరం గణేష్ ను మూడున్నర గంటలు ఒక గదిలో నిర్బంధించి విపరీతంగా చితకబాదారు. తన భర్తను కొట్టొద్దు అంటూ కాళ్ళ మీద పడి అతని భార్య మౌనిక బతిమిలాడి వేడుకున్న కాళ్లతో తన్నారే కానీ కనీసం కనికరించలేదు. ఈ సంఘటన జరిగి వారం రోజులు గడిచిన గాని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు స్పందించకపోవడం విచారకరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కులం పేరుతో బీసీలపై దాడులు జరగటం బాధాకరం ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది తల్లమల్ల హసేన్ ప్రశ్నించారు
ఈ సంఘటనపై ఈరోజు ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు కెవిపిఎస్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు
ఈ ధర్నా లో పాల్గొన్న మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది తల్లమల్ల హసేన్. కెవిపిఎస్ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, తెలంగాణ మాదిగ జన సమితి అధ్యక్షులు ఊట్కూరు సైదులు మాట్లాడుతూ కుమ్మెర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించాలని నిందితులను కఠినంగా శిక్షించాలని పసిబిడ్డ హత్య కారకులైన వారిపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినారు
ఈ ధర్నా కార్యక్రమంలో మాల మహానాడు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బోల్లెద్దు వినయ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల నరసయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నామా వేణు రాష్ట్ర కార్యదర్శి కాశిమల్ల వెంకట నరసయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం, సిఐటియు నాయకులు మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.