కార్మికుల దేశవ్యాప్త  సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి 

May 12, 2025 - 19:20
 0  29
కార్మికుల దేశవ్యాప్త  సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి 

సిఐటియూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు

అడ్డగూడూరు 12 మే 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-  యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల కేంద్రంలో సిఐటీయూ మండల జనరల్ బాడీ సమావేశం సిఐటీయూ మండల నాయకులు బుర్రు అనిల్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.


   ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పండు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ.. ఈనెల 20వ తారీకున దేశవ్యాప్తంగా జరిగే సార్వతీక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి  ప్రభుత్వం   కార్మిక ప్రజా,వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను, అదేవిధంగా కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వలన 5% ఉన్న పెట్టుబడిదారుల వద్ద 70% ఆదాయం పోగుపడగా, 50% ప్రజల వద్ద కేవలం 3% మాత్రమే హుండీ రోజు గడవడమే కష్టంగా మారింది. పేదరికం 17% శాతానికి పెరిగింది పెరిగిన, ద్రవ్యోల్బణం,నిత్యవసర సరుకుల ధరలు, కార్మిక పేద ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అదే విధంగా ఏపీఎస్ పిఎఫ్ పిడిఐఎస్లకు యాజమాన్యాలు సకాలంలో చెల్లించకపోతే గతంలో ఉన్న 25% పిన్నెల్లి వడ్డీని ఒక్క శాతం తగ్గించి యాజమాన్లను మరింత డిఫాల్ట్ గా మారుస్తున్నారు. ఈపీఎఫ్ఓ తెలంగాణ రీజినల్ లో 28 వేల కోట్లు ప్రభుత్వ విద్యా వైద్యం గ్రామీణ ఉపాధి హామీ ఐసిడిఎస్ పథకాలకు వార్షిక బడ్జెట్లలో కోత పెడుతున్నారని అన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కార్మిక సమస్యల పైన జరిగేటువంటి సమ్మెనే విజయవంతం చేయాలని కోరారు.


   ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ ఎంప్లొస్ మండల అధ్యక్షులు బాలెంల మల్లయ్య,ఆటో కార్మికులు బాలెంల పరిశురామలు,డప్పు యాదగిరి, పసల ఆరోగ్యం,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333