కార్మికులకు దుస్తుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

తిరుమలగిరి 17 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి
తిరుమలగిరి మున్సిపాలిటీ కార్మికులందరికీ సోమవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సమాజాన్ని అనేక రోగాల నుండి కాపాడుతున్న నిజమైన డాక్టర్లు పారిశుద్ధ్య కార్మికులైనని గుర్తు చేశారు. వారు లేకుంటే సబ్య సమాజ జీవన మనుగడ అవుతుందని అన్నారు. వ్యాపార సముదాయాల భవనం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తానని గుర్తు చేశారు.మున్సిపాలిటీ కేంద్రం అహర్నిశలు పనిచేస్తానని విలేకరుల ముందు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి,మాజీ చైర్మన్ శాగంటి అనసూయ రాములు,మండల అధ్యక్షుడు వై నరేష్,పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్,ఎన్ఎస్యుఐ మండల ఉపాధ్యక్షులు కందుకూరి అంబేద్కర్,మూల అశోక్ రెడ్డి,వంగాల డేనియల్,కందుకూరి లక్ష్మయ్య, చింతకాయల సుధాకర్,మూల అశోక్ రెడ్డి, డానియల్, తదితరులు పాల్గొన్నారు.