కార్పెంటర్స్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే బందును జయప్రదం చేయండి. 

Mar 6, 2025 - 22:18
Mar 6, 2025 - 23:23
 0  10
కార్పెంటర్స్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే బందును జయప్రదం చేయండి. 
కార్పెంటర్స్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే బందును జయప్రదం చేయండి. 

ఖమ్మం 06 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-: కార్పెంటర్స్ జేఏసీ సమావేశం జేఏసీ కన్వీనర్ చిన్న బాణాల వీర బ్రహ్మచారి ఆధ్వర్యంలో వర్తక సంఘ భవనంలో జరిగింది . ఇందులో మూడు యూనియన్లు ఒకే తాటి మీదికి వచ్చి రేట్లు పెంచాలని 17/3/25 నుంచి 26/3/25 వరకు నిర్వహించనున్న కార్పెంటర్స్ బందు కార్యాచరణకి సంబంధించిన అభిప్రాయ సేకరణ తీసుకున్నారు . కావున ఈ పది రోజులు జరిగే  బందును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాణాల వీర బ్రహ్మచారి , ప్రధాన కార్యదర్శి సోమా నాగరాజు కుమార్ , కార్పెంటర్ మెస్ట్రీలు మరియు వర్కర్స్ యునియన్ అధ్యక్షులు దోనోజు పాపాచారి , ప్రధాన కార్యదర్శి దిగజర్ల వెంకన్న , ఖమ్మం పట్టణ దుగోడమిషన్ కార్పెంటర్ మేస్త్రి & వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు దొనోజు శ్రీనివాసాచారి , ప్రధాన కార్యదర్శి సందూరి నాగాచారి , కార్పెంటర్ జేఏసీ కన్వీనర్లు మరియు పలువురు ఖమ్మం నగర కార్పెంటర్ మేస్త్రీలు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333