కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి సి ఐ టి యు

Sep 24, 2024 - 20:37
Sep 25, 2024 - 10:19
 0  11
కాంట్రాక్ట్  ఔట్సోర్సింగ్  విధానాన్ని రద్దు చేయాలి  సి ఐ టి యు

కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. సిఐటియు

సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ సెక్టార్లలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వ గుర్తించి వారిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 

స్థానిక కోదాడ పట్టణం లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టిఎస్ఆర్టిసి డిపో మేనేజర్ శ్రీ హర్ష కి మెమోరాండం ఇవ్వడం జరిగింది 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వ శాఖలలో ప్రజలకు ఉపయోగపడే పనులను చేస్తూ ఆ ప్రభుత్వాన్ని ఒక స్థాయిలో నిలబెట్టి పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు కరువయ్యాయని వారన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం వేటీచాకిరి చేయించుకుంటూ కనీస వేతనాలు ఇవ్వడం లేదని ప్రభుత్వం వెంటనే వారికి కనీస వేతనం 26 వేల రూపాయలు వేతనాన్ని అమలు చేయాలని వారు అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి అందులో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తానని చెప్పి ఒక్క మాట కూడా అమలు చేయ పోగా మాయమాటలు చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే మనుగడ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న నేటికీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే పరిస్థితి లేదని అన్ని శాఖలలో వారితో పని చేయించుకుంటూ వారికి గుర్తింపు లేకుండా చేస్తున్నారని వారు అన్నారు. తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని గుర్తింపు కార్డు ఇవ్వాలని సీనియారిటీ బట్టి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలయింతవరకు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులను చైతన్యం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం , రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమాలు చేస్తామని వారన్నారు .ఈ యొక్క కార్యక్రమంలో సరోజమ్మ సైదమ్మ కుడుముల మరియమ్మ కందుకూరి సుగుణమ్మ ఎస్ నాగమ్మ కే చైతన్య వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State