కాంగ్రెస్ మూసీ పునరుజ్జీవ సభ స్టేజీ గుద్దుకుని యువకుడు మృతి

బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం

Oct 27, 2024 - 12:23
Oct 27, 2024 - 21:37
 0  6
కాంగ్రెస్ మూసీ పునరుజ్జీవ సభ స్టేజీ గుద్దుకుని యువకుడు మృతి

మృతుడు వలస కూలీ చరణ్(17)గా గుర్తింపు

బ్రిడ్జి పై రోడ్డుకు అడ్డంగా సభ స్టేజ్ వేయడంతోనే ప్రమాదం

మృతదేహం ఆఘమేఘాలపై అంబులెన్స్ లో అక్కడి నుంచి తరలింపు

స్టేజి తొలగిస్తున్న కాంగ్రెస్ లీడర్లు

అడ్డగూడూరు 26 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మానాయకుంట తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి మూసీ పరివాహక రైతుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించిన స్టేజిని మనాయికుంట గురజాల రహదారి బ్రిడ్జి పైన వేయడంతో అటుగా వెళుతున్న వ్యక్తి యధావిధిగా బాట ఉందని బైక్ పై వెళ్తూ స్టేజిని తగిలి స్పృహ కోల్పోవడంతో ఇది గమనించిన కాంగ్రెస్ నాయకులు హుటా హుటిన అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, చరణ్ అనే అబ్బాయి మృతి చెందినట్టుగా స్థానికులు తెలిపారు.