కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కనుమరుగైపోయింది

అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ 

Dec 13, 2024 - 12:17
 0  6
కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కనుమరుగైపోయింది

జాతీయ రహదారుల వల్లే తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి 
రాబోయే ఎన్నికల్లో ప్రజలు బిజెపిని ఆదరించాలి 
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ 

మోత్కూరు 13 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డమాల్ అయిందని, నెలకు రెండు మూడు ఫ్లాట్లు అమ్ముకొని జీవనం సాగించే వ్యాపారులు సైతం కాంగ్రెస్ పాలనలో ఏడాదికి ఒక్క ఫ్లాట్ కూడా అమ్ముకోకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. గురువారం ఆయన మోత్కూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఎన్నికల సమయంలో అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతం అన్నారు.6గ్యారంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని ప్రజలకు అందించకుండా మొండి చేయి చూపడంతో ప్రజలు తీవ్ర నిరుత్సాహంతో రగిలిపోతున్నారని ఆయన పేర్కొన్నారు.రైతులకు రైతుబంధు బంద్ చేయించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు.మహిళలకు 2500 ఇస్తామని,ఆసరా పింఛన్ 4వేలు ఇస్తామని,వికలాంగులకు 6వేలుఇస్తామని,5వందల రూపాయలకే సిలిండర్లు అందజేస్తామని బహిరంగ సభల్లో ప్రగల్బాలు పలికి వాటిని అమలు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. తుంగతుర్తి నియోజకవర్గo అభివృద్ధి చెందుతుంది అంటే అది తన హయాంలో కేంద్ర ప్రభుత్వం నుండి భారీగా నిధులు తీసుకొచ్చి జాతీయ రహదారులు వేయించడం వల్లనే అని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ఘనత తమ నాయకుడు,భారత ప్రధాని నరేంద్ర మోడీకి,బిజెపి ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో,మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు బిజెపికి బ్రహ్మరథం పట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ కడియం రామచంద్రయ్య,పట్టణ అధ్యక్షులు పోచం సోమయ్య, జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్ గుప్తా,కొనతం నాగార్జున రెడ్డి, నాయకులు లింగాల శ్యామ్ సుందర్ రెడ్డి,తీగల శ్రీధర్,గుంటి సతీష్,తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333