కబడ్డీ పోటీలను ప్రారంభించిన బీరం హర్షవర్ధన్ రెడ్డి

Mar 18, 2026 - 19:44
Mar 18, 2026 - 20:38
 0  1
కబడ్డీ పోటీలను ప్రారంభించిన బీరం హర్షవర్ధన్ రెడ్డి

ఉగాది సందర్భంగా ఉత్సాహంగా కబడ్డీ పోటీలు ప్రారంభించిన

మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చిన్నంబావి మండల కేంద్రంలో ఉగాది పండుగను పురస్కరించుకొని బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తాలూకా స్థాయి కబడ్డీ పోటీలను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి వచ్చిన బీరం హర్షవర్ధన్ రెడ్డికి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ, మాజీ జెడ్పిటిసి వెంకట్రామమ్మ చిన్నరెడ్డి, ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు, పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన, అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కబడ్డీ మైదానానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులతో కరచాలనం చేసి, వారిని పరిచయం చేసుకున్నారు. స్వయంగా కబడ్డీ ఆడుతూ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని, రేకెత్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడలు నిర్వహించడం ద్వారా ప్రజల మధ్య ఐక్యత పెంపొందుతుందని, ఆధునిక కాలంలో సంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న నేపథ్యంలో కబడ్డీ వంటి ఆటలను ప్రోత్సహించడం అభినందనీయం అన్నారు. యువతకు విద్యతో పాటు క్రీడలు కూడా సమానంగా అవసరమని, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని కొల్లాపూర్‌ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. విజేతలకు మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ మొదటి బహుమతిగా రూ.30,000 నగదు మరియు షీల్డ్, కేతపాగా విజయ్ రెండవ బహుమతిగా రూ.15,000 నగదు మరియు షీల్డ్ ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ, మాజీ జెడ్పిటిసి వెంకటరమణమ్మతో పాటు అయ్యవారిపల్లి సర్పంచ్ పద్మావతి,కలూరు సర్పంచ్ నీలమ్మ, వెలగొండ సర్పంచ్ శరత్ రెడ్డి, సర్పంచ్ పెద్ద నరసింహ, చిన్నమారు సర్పంచ్ శంకర్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నరేందర్ రెడ్డి, పుష్పలత, రామన్ గౌడ్, గజ్జె ఈదన్నయాదవ్, గోవింద్ శ్రీధర్ రెడ్డి, కేశిరెడ్డి చిన్నారెడ్డి, పసుపుల రంజిత్ కుమార్, డేగ శేఖర్ యాదవ్,ఉగ్ర నరసింహ, పరిమళ ప్రకాష్, డప్పు నరసింహ, మహిచంద్, రామేష్, ఆర్ఎంపీ కృష్ణ, బ్రహ్మం, గుడెపు శివారెడ్డి, తగరం కురుమయ్య,మహేశ్వరెడ్డి, కొట్టె మహేష్, కానుగల రాజు, వడ్డేమాన్ రామకృష్ణ, వెంకట్రామారెడ్డి, JVK నాయుడు, బిచ్చన్న, కేతపాగ మధు, కేతపాగ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State