ఓపెన్ టెన్త్ ఒకే సంవత్సరం పూర్తి చేయడానికి చివరి రెండు రోజులు అవకాశం
తెలంగాణ వార్త ప్రతినిధి:- ఆరు నెలల్లో టెన్త్,ఇంటర్ పూర్తి ముగింపు దశకు ఓపెన్ అడ్మిషన్ల గడువు..!!
రెగ్యులర్ టెన్త్, ఇంటర్ పైయిల్ అయిన విద్యార్థులు అర్హులు....
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల గడువు అపరాధ రుసుముతో ఈ నెల 31 వరకు మాత్రమే ఉన్నదని ఇంక కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నదని లక్ష్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడెమి కో ఆర్డినేటర్ అనంతుల సతీష్ సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. చదువు మధ్యలో మానివేసినవారు పదవ తరగతికి దరఖాస్తు చేసుకోవచ్చని, పది పాసైన వారు ఇంటర్ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసుకునే అవకాశం వున్నదని చెప్పారు. ఈ అవకాశం మళ్ళీ రాదని వెంటనే అడ్మిషన్ తీసుకోవాలని వారు కోరారు.ఇంటర్ లో గ్రూప్స్ ఎంపీసీ ,బైపిసి,సైన్స్, ఆర్ట్స్ ఇంగ్లీషు,మరియు తెలుగు మీడియం లలో అడ్మిషన్లు పొందవచ్చును పదవ తరగతి కి రాయడం చదవడం వచ్చి పద్నాలుగు సంవత్సరాలు నిండిన వారు పదవ తరగతి పూర్తి చేసుకునే అవకాశం కలదు అని అన్నారు రెగ్యులర్ టెన్త్ , ఇంటర్ విద్యార్థులు మీరు పెయిల్ అయిన సబ్జెక్టులు ఓపెన్ లో రాసుకునే అవకాశం కలదు అడ్మిషన్లు కి మరిన్ని వివరాలు కి లక్ష్య డిస్టెన్స్ అకాడెమి బ్రిలియంట్ స్కూల్ ప్రక్కన నయనగర్ కోదాడ సంప్రదించాల్సిన నంబర్స్ 9542107771 , 7981528312 ను కోరారు