ఐకేపీ సెంటర్లో తడిసి మొలకేత్తిన వడ్లను పరిశీలించిన మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

May 26, 2025 - 20:42
 0  1
ఐకేపీ సెంటర్లో తడిసి మొలకేత్తిన వడ్లను పరిశీలించిన మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మండల పరిధి ఏపూర్ గ్రామం ఐకేపీ సెంటర్లో తడిసి మొలకేత్తిన వడ్లను పరిశీలించిన మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. తమ సమస్యను పరిష్కరించాలంటూ ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.. రైతుల సమస్యలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం . ఈ శాఖమంత్రి ఏమి స్తున్నాడు రైతులు రెండు నెలలు ఐతున్న ఇంతవరకు ధాన్యాన్ని కంట వేయకపోవడం దురదృష్టం. ఐకేపీ కేంద్రాల్లో వడ్లు ముక్కి మొలకలోస్తున్నాయ్.. 60 రోజులలైనా వడ్లు కొనలేదంటే.. ఇంతకన్నా దారుణముంటదా.. ఐకేపీ కేంద్రాల్లో పార్ బాయిల్డ్ వాసనలు.. నీళ్లు రాక అరకొరగా పండిన పంట వడ్లు మొలకళ్లొచ్చినయి.. ఐకేపీ కేంద్రాల్లో రైతుల కష్ఠాలు ప్రభుత్వానికి పట్టవా.. ఋతుపవనాలొచ్చి దుక్కి దునాల్సిన రైతు ధాన్యం కుప్పల వద్ద కాపలా కాయాల్సి వస్తుంది వడ్లు కొనే దిక్కు లేక రైతులు తీవ్రయిబ్బందులు పడుతున్నరు.. కాంటాలైనాక మిల్లుల్లో రైతులతో బేరాలు.. రెండు మూడు రోజులకోసారి వచ్చే లారీల కోసం రైతుల సరిపడ గోనె సంచులు లేవు పడిగాపులు.. చివరికి రైతులు దళారుల కాళ్ళు పట్టుకునే దుస్థితి దాపురించింది.. పంట పండించేందుకు కష్టపడ్డ రైతు.. వడ్లు అమ్ముకునేందుకు మరింత కష్టపడుతున్నాడు.. అన్నిరంగాలతో పాటు రైతంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అన్యాయం చేసింది.. ఐకేపీ కేంద్రాల్లో గింజలేకుండా ప్రభుత్వం వెంటనే కొనాలె.. రైతులను వడ్లు కంట వేయమంటే కాంగ్రెస్ వాళ్ళకు ముందు వడ్లు కంట వేస్తున్నారు BRS పార్టీ వారికి నెలలు గడుస్తున్న కంట వేయడంలేదు ఇదేంటి అని రైతులు అడిగితే మా ఇష్టం అంతే అని సమాధానం చెపుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు మాజీ మంత్రి గారి వెంట మాజీ ఎంపీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు తుడి నరసింహారావు జిల్లా నాయకులు మరల చంద్రారెడ్డి కసాగాని బ్రహ్మం బూర బాల సైదులు గౌడ్ పుట్ట కిషోర్ మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం జీవన్ రెడ్డి కణాల మల్లారెడ్డి మాజీ ఎంపిటిసి దామిడి శ్రీను బషీర్ సోమిరెడ్డి చిన్న వెంకటరెడ్డి తంగెళ్ల మధుసూదన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.