ఏ సీబీవలలో అవినీతి తిమింగలం
లక్ష రూపాయలు లంచం తీసుకుంటున్న గా పట్టుకున్న ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్ కేంద్రంగా బహిరంగంగా సెటిల్మెంట్ దందాలు*
మధ్యవర్తుల ద్వారా సెటిల్మెంట్ చేసుకొని లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్న ఎస్ఐ*
పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పై రవికారులకు పంచాయతీలు అప్పజెప్పి మామూలుతీసుకుంటున్న ఎస్ఐతిరుమలగిరి పోలీస్ స్టేషన్లో పేదవాడికి న్యాయం జరగడం లేదని ఆరోపణ*
*పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలంటే ఎస్సైకి అనుకూలంగా ఉన్న పైరవీ కారులు చెబితేనే పిటిషన్ తీసుకుంటున్న పోలీసులు... *పంచాయతీకి ఒకరేటు నిర్ణయించిన ఎస్ఐ"
తిరుమలగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ మేరకు ఎస్సై సురేష్, కానిస్టేబుల్ నాగరాజులు పీడీఎస్ బియ్యం కేసులో మూడు లక్ష రూపాయలు డిమాండ్ చేసిలంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడులు చేసి పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా వడ్డేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో దాడులు చేయగా పట్టుబడ్డారు. డిమాండ్ చేసిన మూడు లక్షల రూపాయలలో గతంలో లక్ష రూపాయలు ఇవ్వగా నేడు మరో లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు ఈ కార్యక్రమంలో అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ జగదీష్ చందర్,
సి.ఐ వెంకట్ రావు, సి.ఐ రామ రావు, సిబ్బంది శ్రీదర్,నరేష్,సంపత్
17 మంది సిబ్బంది పాల్గొన్నారు , కాగా తుంగతుర్తి నాగారం సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఎస్సైలు సీఐలు ప్రైవేటు డ్రైవర్లను నియమించుకొని అక్రమ దందాకు పాల్పడుతున్నారు తెలిసింది తిరుమలగిరి ఎస్ ఐ సురేష్ తన డ్రైవర్గా ప్రైవేటు వ్యక్తి నియమించుకొని అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది ఇదే డ్రైవర్ నాటు సారా గంజాయి విక్రయించే వారికి సహకరిస్తున్నారని ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ డ్రైవర్లను వెంటనే తొరించాల్సిందిగా పలువురు ప్రజలు కోరుతున్నారు