ఏ ప్రయోజనం కోసం యూట్యూబ్ ఫేస్బుక్ ఛానల్ లో అశ్లీల దృశ్యాలు లైవ్ ప్రసారాలు?*
ఇవి సామాజిక సంస్కరణకా? లేదా సమాజ విచ్చిన్నానికా? సిగ్గుతో తలవంచుకోవలసిన సంఘటనలు, సన్నివేశాలు రద్దు చేయాలి..
---వడ్డేపల్లి మల్లేశం
మాటవరసకు అర్థనగ్న అంగాంగ ప్రదర్శనల దృశ్యాలు సమాజాన్ని విచ్చిన్నం చేస్తాయని అంటా రే కానీ గుడ్లప్పగించి, చెవి వద్ద పెట్టుకుని ఆ సంభాషణలు, సయ్యాటలు, సైగలను కల్లారా చూస్తూనే ఉంటారు. ఇప్పటికే పత్రికల్లో టీవీ ప్రసారాలలో సినిమాలలో మించిన స్థాయిలో సెక్స్ దృశ్యాలు తారాస్థాయికి చేరితే అర్థనగ్న దృశ్యాల ప్రదర్శనకు యువతను రెచ్చగొట్టడానికి పెట్టుబడిదారీ వర్గానికి సొమ్ము చేయడానికి కూడా ఇలాంటి వ్యక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతున్నారంటే ఈ వ్యవస్థ యువత ఎటువైపు ప్రయాణిస్తున్నదో అర్థం చేసుకోవాల్సి ఉంది .ఇప్పటికే క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు, డ్రగ్స్, గుట్కాలు, మద్యపానం, ధూమపానం వంటి అసాంఘిక కార్యక్రమాలను సమాజంలో 100% అమలు చేస్తూ చేయడానికి సహకరిస్తున్న కొన్ని వర్గాలు సమాజాన్ని బ్రష్టు పట్టిస్తూ ఉంటే అనైతికతకు సిగ్గుతో తలవంచుకోవలసిన దుస్థితి దాపూరించింది. అంగాంగ ప్రదర్శనలు అర్ధ నగ్న దృశ్యాలు వావివర్సలు మరిచిన సెక్స్ ఉచ్చరిస్తేనే తల బద్దలయ్యే పదాల పొందిక అడుగడుగునా ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ ను స్పష్టంగా కనపడుతూ యువతను రెచ్చగొడుతూ కొత్త పద్ధతిలో కోరికలను తీర్చుకోవడానికి ఎగబడే ధోరణిని బహుశా అభివృద్ధిగా భావిస్తున్నారో ఏమో! అభివృద్ధి చెందుతున్న దేశం కనుక అభివృద్ధి చెందే క్రమంలోకి పోవాలంటే ఈ రంగంలో అభివృద్ధి చెందితే అదే రుజువు అని అనుకుంటున్నారా? ఎంత సిగ్గుమాలిన పరిస్థితి?
అధికారులకు ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధులకు తల్లిదండ్రులకు కవులు రచయితలు కళాకారులు మేధావులు సంఘసంస్కర్తలకు ఇవన్నీ కూడా తెలియనివి కావు. కానీ యువత పక్కదారి పడుతూ చెడిపోతూ ఉంటే వీటి ప్రభావం అంతా అంతా కాదని తెలిసి కూడా మౌనంగా ఉంటున్నారు ఎందుకు అనేది నా వాదన, ఆవేదన. అందుకే ధైర్యం చేసి కొన్ని అంశాలను నిజంగా ప్రస్తావించక తప్పడం లేదు కనుక క్షమించమని కోరుకొని అనివార్యమైన పరిస్థితుల్లో మీ అందరి దృష్టికి తీసుకురాక తప్పడం లేదు. ఇప్పటికే టీవీ ప్రసారాలు ప్రత్యక్షంగా పరోక్షంగా యువత మీద సమాజం మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటే మద్యం మత్తు పానీయాలను కూడా స్వీకరిస్తున్నప్పుడు చట్టబద్ధంగా చూపిస్తూ చేయకూడని పని చేయడానికి మాట్లాడకూడని పదాలను పలకరించడానికి అనుమతించినటువంటి టీవీ ప్రసారం ప్రత్యక్షంగా వ్యక్తుల మీద ప్రభావం కలిగించడం లేదా? అదే కోవలో నిరంతరం చేయి విడిచి ఉండలేనటువంటి హస్తభూషణమైన సెల్ఫోన్ వ్యవస్థలో ప్రపంచమంతా ని బిడీకృతమైనది అంటే అతిశయోక్తి కాదు. కానీ విజ్ఞానపరమైన శాస్త్ర సాంకేతిక రాజకీయ చారిత్రక అంశాలకు సంబంధించి విస్తృత పరిజ్ఞానాన్ని సంతరించుకోవడానికి ఎంతో పెద్ద వనరుగా ఫోన్ పనిచేస్తుంది. కానీ నేటి యువత విద్యార్థులు తరగతుల్లో కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో పని ప్రదేశాలలో అంతేకాదు వృద్ధులు కూడా సమయము చిక్కినప్పుడు చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఫేస్బుక్లో తమకు నచ్చిన బొమ్మలను చూస్తూ అదే సందర్భంలో వికృత పద్ధతిలో వెలువరించేటువంటి శీర్షికల కతాంశాన్ని వీడియోలనుచెవుల ఆరగించి తృప్తి పడుతున్నారు. మానసిక ప్రశాంతత పొందుతున్నారు. ఏదో సాధించినట్లు భావిస్తున్నారే తప్ప ఈ సమాజం బ్రష్టు పట్టుకోవడానికి యువత నాశనం అయిపోవడానికి తమ కుటుంబ సభ్యులు ముఖ్యంగా వయసు మీద ఉన్న పిల్లలు తమ కర్తవ్యం నిర్వహణ నుండి వైదొలగే ప్రమాదం ఉంటుందని మాత్రం భావించడం లేదు. ఈ దుస్థితి ని సమాజానికి పడిన గండిగా భావించవలసి ఉంటుంది. .వ్యాఖ్యాతలు ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు కథనం ద్వారా సమాచారాన్ని ఇచ్చేవాళ్లు ప్రత్యక్షంగా పరోక్షంగా సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ ను సేవ్ చేసుకోమని చెప్పడం ద్వారా ఇదేదో సమాజ ఉద్ధరణకు సంబంధించినదని అందరూ భ్రమపడే అవకాశం కూడా లేకపోలేదు. కానీ మార్పు, సామాజిక సంస్కరణ కంటే సమాజ విచ్చిన్నానికి ఎక్కువగా కారణం అవుతున్న ఇలాంటి వీడియోలను ప్రసారం చేయడం పైన ఉక్కు పాదం మోపాల్సిందే.పాలకులు ప్రజలు చైతన్యవంతమైన యువత తాత్కాలిక ప్రలోభాలకు భావావేశానికి మానసిక ఆనందానికి మాత్రమే పరిమితమై చూసి సంబరపడితే విలువలతో కూడుకున్న సుదూర జీవన ప్రయాణానికి అనేక గండ్లు పడతాయి జాగ్రత్త.
అశ్లీల, అఘాయిత్యాలు -ప్రస్తావించినందుకు క్షమించాలి:-
*********
ఆడియోలు వీడియోల రూపంలో ప్రసారమవుతున్న సెక్స్ కు సంబంధించిన కథనాలు ముఖ్యంగా బావా వేషాన్ని, ఆసక్తిని పెంచి తాత్కాలికంగా ఊహలోకములోకి తీసుకుపోతాయి కావచ్చు. మానవ బలహీనతను సొమ్ముచేసుకోవడం కోసం వావి వరుసలు, సంస్కారా న్ని మరిచి ఇలాంటి వీడియోలు చేయడం చట్ట వ్యతిరేకం అని పాలకులు ఇప్పటికైనా గుర్తిస్తే బాగుంటుంది. కానీ ఆశించిన దాని కంటే విచ్చిన్నానికే ఎక్కువగా కారణం అవుతున్న సందర్భంలో వీటిని నిర్మూలించడమే మంచిదేమోనని మేధావులు హెచ్చరిస్తుంటే .బాధ్యత మరిచిన పాలకులు సమాజం తలవంచుకోవలసివుంటుంది జాగ్రత్త!
సిగ్గుతో తలదించుకునే శీర్షికలు:-
"భార్య అనుకొని తల్లితో కొడుకు, రాత్రి భార్యతో పగలు అత్తతో, 24 గంటలు పడక గదిలోనే, వాడు మానవుడా రాక్షసుడా ఎప్పుడు అదే పని కావాలి, 50 ఏళ్ల ఆంటీ 20 ఏళ్ల యువకున్ని కోరుకున్న వైనం, భూస్వామి భార్యతో పాలేరు సరసం, అప్పు చెల్లించాల్సిన అవసరం లేదు సహకరిస్తే సరిపోతుంది, పగలు రాత్రి తేడా లేకుండా అదే పని, భార్యలను మార్చుకునే సంస్కృతిపై వీడియోలు, ఉపాధ్యాయురాలికి గర్భం చేసిన విద్యార్థి, నమ్మిస్తూ వరుసగా పెళ్లిళ్లు చేసుకొని వ్యాపారం చేసి విడిచి పెడుతున్న స్త్రీలు పురుషులు, మత్తు జల్లి అఘాయిత్యానికి పాల్పడుతున్న పనిమనుషులు, కూలీలు టెక్నీషియన్లు, కొడుకు విదేశీ పర్యటన నేపథ్యంలో నవ వధువుతో మామ సరసం, యువతని లొంగదీసుకున్న వృద్ధుడు, 24 గంటలు తట్టుకోలేకపోతున్న అంటూ ఏడుపులు, యువతి పె డబొ బ్బలు, నేను గర్భవతిగా ఉంటే తట్టుకోలేక మాఆ యన మాఅ మ్మతో... వంటి అనేక శీర్షికల రూపంలో యూట్యూబ్ ప్రసారా లు ఫేస్బుక్లో దర్శనమిస్తుంటే విస్తృత విజ్ఞాన దాయకమైన అనేక అంశాలను పక్కనపెట్టి వీటిని చూస్తూ యువత విద్యార్థులకు కాలయాపన చేస్తూ పెడదారి పడుతూ ఉంటే ఆ ముసుగులో రుచులు యవ్వనంలో తప్ప తాగి నాగరికత సంస్కారాన్ని సంస్కృతిని బ్రష్టు పట్టిస్తూ ఒకవైపు అటు సినిమాలు టీవీ ప్రసారాలు అదే పరిస్థితులు యూట్యూబ్ ఛానల్ లో అంతకుమించిన స్థాయిలో ఆకర్షణలు .
సెక్స్ పరిజ్ఞానం యువతకు తెలియదనియా? లేక యువతను పెడదారి పట్టేలా నష్టపెట్టాలనా? రెచ్చి పోవడం ద్వారాతాత్కాలిక మానసిక అనుభూతి పొందడం కోసమే ఈ సిగ్గుమాలిన ప్రయత్నాలా? వీటి పైన యావత్ సమాజము మేధావులు టెక్నీషియన్లు సీరియస్ గా దృష్టి పెట్టవలసి ఉన్నది. జ్ఞాన సముపార్జనకే ఇలాంటి ప్రసారాలు ఉపయోగపడుతున్నాయని నిర్వాహకులు అనుకుంటే అంతకుమించి వందల రెట్ల సంస్కృతి సభ్యత మానవ విలువలు నాశనమవుతున్నట్లు మనకు తెలియంది కాదు. వీటి పర్యవ సానంగా అనేక అత్యాచారాలు హత్యలు మానభంగాలు పసిపాపలపై పశువులపై వృద్ధులపై జరుగుతున్న ఆగడాలు వీటి పరాకాష్టగా భావిస్తే తప్పేంటి?
వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం అని సాహిత్యానికి సంబంధించి శ్రీశ్రీ అంటాడు. అలాగే సంసారిక సెక్స్ పరమైన కుటుంబ పరమైన భావోద్వేగానికి సంబంధించిన అంశాలు వ్యక్తిగతంగా చూసుకుంటేనే అర్థం ఉంటుంది. ఆ అవగాహనకు సంబంధించినటువంటి పుస్తక పరిజ్ఞానం చర్చలు ప్రశ్నలు సమాధాన రూపంలో ఇతరత్రా పొందడానికి అభ్యంతరం లేదు. కానీ పూర్తిగా బరితెగించిన పద్ధతిలో అశ్లీలంగా ఏవగింపు కలిగించే విధంగా వీడియోల లో ప్రవర్తన సన్నివేశాలను పొందుపరచడం మన సభ్యతను క్రమశిక్షణను కార్యదక్షతను పెడత్రోవ పట్టించేదిగా ఉంటుంది.
సమాజంలో అక్కడక్కడ కొన్ని దుస్ సంఘటనలు బాధాకరమైన సన్నివేశాలు హత్యలు అత్యాచారాలకు సంబంధించిన విషయాలు లేదా స్త్రీ పురుషుల మధ్యన ఏర్పడిన వివాదాలను న్యాయవేదిక ప్రత్యేక కార్యక్రమం ద్వారా పరిష్కరించడానికి ఒకవైపు కృషి జరుగుతున్నది .భార్యాభర్తలు గా కొనసాగడానికి తమకున్నటువంటి కొన్ని శారీరక మానసిక లోపాలను సవరించుకోవడానికి కూడా విజ్ఞాన వేత్తలు వైద్యులు చక్కనైన సమర్థవంతమైన సూచనలు చేయడంతో పాటు జీవనశైలి మార్చుకోవడం వైద్య సలహాలను అందిస్తూనే ఉన్నారు. వాటిని నిత్యజీవితంలో ఆచరించడం ద్వారా క్రమశిక్షణతో జీవనశైలిని ఆధునిక పద్ధతిలో అవగాహన చేసుకోవడంతో తమ లోపాలను బలహీనతలను దూరం చేసుకునే అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి విజ్ఞానం అస్లీలం అనిపించుకోదు కానీ అర్థనగ్న దృశ్యాలే మా సంస్కారం అని బరితెగించి చూపేవాళ్లు నటించేవాళ్లు మాట్లాడేవాళ్లు నిర్వహించే వాళ్ళు సారథ్యం వహించేవాళ్లు సంపాదకత్వం వహించే వాళ్ళు ఒక్క అడుగు ముందుకు వేసి ఇది సంపాదన కోసం సంస్కృతి విధ్వంసం కోసం చేస్తున్నారo టే అతిశయోక్తి కాదు. ఏ కాలంలోనైనా మంచిని పెంచి చెడును తుంచి మానవీయ విలువల పునాదిగా సమాజం ఉన్నత స్థాయికి చేరుకోవాలి. తద్వారా సమ సమాజాన్ని కల్లారా ఆస్వాదించాలి అదే నిజమైనటువంటి సమానత్వానికి ప్రతీక. అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అన్న సినీ కవి ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుతం పుస్తకాల్లో యూట్యూబ్ లో ఇతర రంగాలుగా అందుబాటులో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని వివిధ కోణాలలో మనం ఆచరించడానికి వినియోగించుకోవడానికి మన సమస్యలను పరిష్కరించుకోవడానికి తోడ్పడుతున్న నేపథ్యంలో ఇంత బరితెగించిన స్థాయిలో మన పిల్లలు యువతతో సహావృద్ధులు కూడా నేర్చుకోవడానికి సిద్ధపడే ప్రమాదం ఉన్నటువంటి సెక్స్ వీడియోలను వెంటనే నిషేధించడం ద్వారా చట్టం తన పని తాను చేయా ల్సిన అవసరముంది. కొంతమంది ఉపాధి కోసం, బతుకు తెరువు కోసం, సంతోషం కోసం, అస్లీలతను పెంచే వీడియో లు, కథనాలను సన్నివేశాలను కానీ వీడియోలను కానీ వెంటనే రద్దు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం పతనమవుతున్న మానవ విలువలను పరిరక్షించడానికి కొంతవరకైనా తోడ్పడుతుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)