చూపించేది..... రంగుల ప్రపంచం ముసుగులో ఆడంబరం
అనుభవించేది అంతా విషాదం"
ప్రజా వ్యతిరేక చర్యలతో టీవీలో పబ్బం గడుపుతే నిజజీవితంలో కుట్రలు, కుతంత్రాలు,
హత్యలు, అరాచకాలు, దోపిడీల, దుర్మార్గంలో సమాజ పోకడ.?
---వడ్డేపల్లి మల్లేశం
"అనేక అకృత్యాలకు అరాచకాలకు అవకాశవిస్తున్న టీవీలలో ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలు, ముద్దులు ప్రేమకు లేని హద్దులు, అంగాంగ వేషధారణ, లేనిపోని అనుభూతులకు ఆజ్యం పోస్తుంటే అక్రమార్కుల మనసులలో చెడు మూలా లకు భీజం పడుతుంటే ఇదేదో సమాజాన్ని ఉద్ధరించే కార్యక్రమం అన్నట్టు గా టీవీ ప్రసారాల నిర్వాహకులు, కార్యక్రమాల దర్శకులు, హాజరైనటువంటి ఆడంబరాలకు నిలయమైన వర్గాలు రంగు రంగుల ఫో కసింగులతో మిర్మెట్లు గోలిపే కాంతుల మధ్యన విరాజిల్లుతుంటే అక్కడ జరిగే అసహ్యించుకునే సన్నివేశానికి కూడా అందరూ చప్పట్లు కొడుతున్నారు అంటే ఈ రంగుల ప్రపంచం సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు? "ఇప్పటికే సమాజం నిండా అనేక అకృత్యాలు అడుగడుగునా చోటు చేసుకుంటుంటే రాత్రి పగలు తెలియని పరిస్థితుల్లో స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా విగత జీవులై అసభ్యకర ఆవేదన పూరిత సన్నివేశంలో శవాల గు ట్టలను చూడవలసి రావడం బాధాకరం.
కుటుంబ కలహాలు, హింస, ఏకపక్ష ధోరణి, హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యం. దీనికి ప్రస్తుతం టీవీలలో ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలు, సీరియళ్లు, కొన్ని అసభ్యకర చిత్రాలు, తాత్కాలిక సుఖాలకు డబ్బుకు అమ్ముడుపోయినటువంటి కొంతమంది కుట్రపూరిత స్వార్థపూరిత ఆలోచనల కారణంగా చోటు చేసుకుంటున్నటువంటి ఉదంతాలు మన సభ్య సమాజానికి తలవంపులు అవుతున్నాయి. కాగా ప్రసార మాధ్యమాలు, టీవీలు, పత్రికలు, సెల్ఫోన్ వ్యవస్థ అమానవీయ సన్నివేశాలకు ఆస్కారం లేకుండా నైతిక విలువలకు భద్రతా భరోసా కు తోడ్పడే సన్నివేశాలను చూపించడం ద్వారా స్త్రీలల్లో పురుషుల్లో పసిపిల్లల్లో ఆత్మ ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది .టీవీ తెరమీద చూపించే కార్యక్రమాలలో నిర్వాహకులు, పాల్గొంటున్న వాళ్లు మామూలు తెలియని వాళ్ళు ఏమి కాదు.
ఆడంబరాల ముసుగులో కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమాల యొక్క వికృత పరిణామాలను ఆలోచిo చకపోవడం, ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలను పరిశీలించకుండా అనుమతించడం, కొన్ని సినిమాలకు సర్టిఫికెట్ జారీ చేసే సమయంలో నిబంధనలు పాటించకపోవడం, టీవీ ప్రసార కార్యక్రమాల పైన ఎలాంటి అదుపు లేకపోవడం వలన విచ్చలవిడి అసభ్య సన్నివేశాలకు ఆస్కారం కలుగుతున్నది. తద్వారా నిజ జీవితంలో క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు, మద్యపానం ధూమపానం లాంటి సామాజిక రుగ్మతలు కూడా ఇలాంటి కార్యక్రమాలకు తోడు కావడం వలన ప్రజలలో ధైర్యం పెరిగి యువత పక్కదారి పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ క్రమంలోనే అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. వృద్ధులు పసిపాపలు అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు బలవుతున్నారు. సంఘటన జరిగిన తర్వాత అయ్యో అని ఆడిపోసుకోవడం, విచారణ పేరుతో కాలయాపన చేయడం, నివేదికల పేరుతో నెలలు గడపడం, ప్రత్యేక చట్టం పేరుతో సంవత్సరాలు నింపి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు మన భారతదేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. కలకత్తా పట్టణంలో నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక ఉన్నత ప్రభుత్వ దవాఖానాలోనే మహిళా డాక్టర్కు రక్షణ లేకపోవడం సిగ్గుచేటు కాదా? ఈ సంఘటనకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? వైద్యశాలలో ఉన్నటువంటి రక్షణ కవచాలు ఏమిటి? ఈ సంఘటన వెనుక ప్రభావితం చేసినటువంటి ఆలోచనలు నమ్మకాలు చిత్రాలు లేవంటారా?
నిజజీవితంపై భా రి దుష్ప్రభావం---మౌనంగా ప్రభుత్వాలు-- ప్రేక్షక పాత్రలో మహిళా సంఘాలు- చోద్యం చూస్తున్న యువత :-
మనము ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే, చెల్లి అక్క ఉన్న వాళ్లమే., వావి వరుసలు తెలిసిన వాళ్ళమే, తప్పు చేస్తే తప్పటడుగు వేస్తే భారీ శిక్ష అనుభవించాల్సింది ఉంటుందని ఊహించిన వాళ్లమే. అయితే చట్టాలు ఏమీ చేయలేవని, ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్లను చట్టాలు చుట్టాలుగా చూసుకుంటాయని, చట్టం ముసుగులో అధికార యంత్రాంగం తో సంబంధాలు కలవారిని కాపాడే ప్రయత్నాలు కొనసాగడం కూడా పే ద, మధ్యతరగతి, సామాన్య, అట్టడుగు వర్గాల మీద జరుగుతున్న దాడులను ఆపలేకపోవడానికి కారణాలవుతున్నాయి .ఈ సంఘటనలకు సంబంధించిన మూలాలను ప్రభుత్వాలు గ్రహించడం లేదు, వాటి పరిణామాలను అర్థం చేసుకోవడం లేదు,. " సినిమా టీవీ సెల్ఫోన్ వ్యవస్థలకు ఉన్నటువంటి అపరిమిత అధికారాలు, స్త్రీ ని పూర్తిగా నగ్నంగా చూపించే అమానవీయ సన్నివేశాలు, అందుకు ఆకర్షితులై తప్పులు చేయడానికి వెనుకాడనటువంటి యువత, అలాంటి సందర్భంలో కూడా నేరస్తులకి మద్దతిచ్చినటువంటి బలగాలు కారణాలు ఏవైతే నేమి నిజజీవితంలో అడుగడుగునా జరుగున్నటువంటి అపశృతులు.
అనుమతులు లేని అమానవీర దృశ్యాలు, కఠినమైన శిక్షలకు నోచుకోని చట్టాలు, తన దాక వస్తే కదా అని నిర్లక్ష్యం, తాత్కాలిక సుఖాల కోసం మరిగినటువంటి మానవ మృగాలు ఒకవైపు గుంట నక్కల్లా వేచి ఉంటే వీరికి ఆజ్యం పోసి ప్రేరణ కల్పించి రెచ్చగొట్టే సన్నివేశాలు నృత్యాలకు నానా రకాల భంగిమలకు జీవం పోస్తున్నటువంటి ప్రసార మాధ్యమాల యంత్రాంగం తమ సామాజిక బాధ్యతలను విస్మరించడం వల్లనే ప్రత్యక్షంగా చూపిస్తూ పరోక్షంగా రెచ్చగొడుతూ తెరమీద రంగురంగుల ప్రపంచాన్ని రెచ్చగొట్టడం నిజంగా నేరం. అంతే కాదు కఠిన శిక్షలు విధించి అలాంటి తప్పుల పైన ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతో ఉంది. ప్రభుత్వాలు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాయి.
మహిళా సంఘాలు ఈ అన్యాయమైనటువంటి వ్యవస్థ మీద అంతగా ప్రతిస్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. ఇక పురుషులు యువత అవకాశం కోసం వేచి చూసే మానవ మృగాలు విశాల మానవీయ హృదయాన్ని ఏనాడో మరిచిపోయిన సందర్భంలో ఈదుర్వ్యవస్థను నిగ్గదీసి, నిలదీసి, ఉక్కు పాదం మోపే వాళ్లు ఎవరు ? సమాజానికి అనర్థం కలిగించే మద్యపానం, ధూమపానం, బాణసంచా, వివిధ భంగిమలు, రెచ్చగొట్టే మాటలు చర్యలు యధాతంగా కొనసాగినంత కాలం సమాజంలో మార్పులు తీసుకురావడం కష్టం. ఒకవైపు కఠిన చట్టాలు అమలు చేస్తూనే మరొకవైపు రెచ్చగొట్టే సన్నివేశాలు సంఘటనలు మీడియా ప్రభుత్వ ఆమోదిత కార్యక్రమాలను,అసభ్య సంభాషణలు, అంగాంగప్రదర్శనలను పూర్తిగా నిషేధించినప్పుడు, సౌందర్యం వ్యక్తిగతమని గుర్తించినపుడు మాత్రమేసాధ్యం. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించినప్పుడు, మానవీయ విలువలను క్షేత్రస్థాయి నుండి పెంపొందించడానికి ప్రయత్నించినప్పుడు సంఘంలో కొంతవరకైనా మంచిని చూడగలం.సమాజంలో, విద్యావ్యవస్థలో బలమైన పునాదులతో ఆ మంచి ఏదో మనతోనే ప్రారంభిo చి నయవంచకులకు నడి బజార్లో శిక్షలు పడేలా చూద్దాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ