ఎస్సీ వర్గీకరణ చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాలి 

తెలంగాణ మాదిగ జర్నలిస్టు  ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ

Dec 13, 2024 - 17:23
 0  16
ఎస్సీ వర్గీకరణ చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాలి 

అడ్డగూడూరు 13 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ప్రభుత్వం ఎస్సీ ఎ బి సి డి వర్గీకరణ చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ వ్యవస్థపాక అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ కోరారు.శుక్రవారం హైదరాబాద్ లోని బూర్గుల రామకృష్ణ రావు భవన్ లో మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమీషన్  శమీమ్ అక్తర్  కార్యాలయంలో జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ తరుపున వినతిపత్రం అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ..ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు వర్గీకరణ చేసి ఎస్సీ జాబితాలో ఉన్న59కులాలతో పాటు వారికి జనాభా దామాషా ప్రకారం ఎవరికెంతో వారికి అంత వాటా ఇచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ డిమాండ్ గత 30ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదన్నారు.ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన పేద కులాల ప్రజల స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.రాజ్యాంగం ద్వారా అందాల్సిన ఫలాలు 59 కులాలకు సక్రమంగా అందడం లేదని 30ఏళ్లుగా పోరాటం జరుగుతుందన్నారు.షెడ్యూల్  కులాల ప్రజలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం పోరాటాలు చేస్తున్నారని తెలిపారు.స్వాతంత్రం కన్నా ముందే నిజాం కాలంలో భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలో దళితుల అభ్యున్నతి కోసం జరిగిన కృషిలో కూడా ఎస్సీ జాబితాలో ఉన్న మాదిగ,ఉపకులాల ప్రజలకు అన్యాయమే జరిగిందని చెప్పారు.సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఆధారంగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచక్షణాధికారంతో 2011జనాభా లెక్కల ఆధారంగానే కాకుండా2014,2024లో తీసిన జనాభా లెక్కల ఆధారంగా కోటాను పెంచి జనాభా దామాషా ప్రకారం  ఎస్సీ ఏబిసిడి వర్గీకరణక చేసి  న్యాయం చేయాలన్నారు.అయన వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్,రాష్ట్ర కార్యదర్శి 
సుక్క అశోక్ మాదిగ,
బాలకృష్ణ,తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333