మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఈవో

చర్ల -జులై -30
చర్ల ఈవో సురేష్ ని సస్పెండ్ చేయాలని న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కి వినతి పత్రం
చర్ల మండలంలో ఉన్న సి ఆర్ కాలనీ చెందిన మహిళ నిన్న ఆధార్ కార్డు అప్డేట్ కోసం చర్ల పంచాయతీ ఈవో సురేష్ ని కలవడం కోసం వెళితే అధికార దుర్వినియోగంతో మద్యం మత్తులో ఆ వరలక్ష్మి అనే మహిళతో అసభ్యంగా ప్రవర్తించి ఇస్టాను సారంగా బూతులు మాట్లాడాడు బయటకు గెంటివేశాడు ఇలాంటి అధికారులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ని కోరుతూ *సీ పీ ఐ ఎంఎల్ డెమోక్రసీ పార్టీ భద్రాచలం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చర్ల ఎంపీడీవోకి వినతిపత్రం సమర్పించడం జరిగింది*.
అనంతరం బాధితురాలు వరలక్ష్మి *సీ పీ ఐ ఎం ఎల్ ముసలి సతీష్ మాట్లాడుతూ* చర్ల మండలం మొత్తం ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ వారికి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఎక్కువగా నిరక్షరాస్యులు,అలాంటిది ఆదివాసి మహిళలు ప్రభుత్వం ప్రకటించిన ఆధార్ కార్డు అప్డేట్ కోసం వెళితే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.నిన్న వెళ్లిన ఆదివాసీ వరలక్ష్మి అనే మహిళను ఇస్టానుసారంగా మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించడంతో మానసిక ఆందోళనకు గురైన వరలక్ష్మి ట్యాబ్లెట్స్ మింగుతుంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆపి మాట్లాడుదాం అని చెప్పడంతో ప్రమాదం నుండి బయటపడింది. చుట్టుపక్కల వాళ్ళు గమనించి ఉండకపోతే పెద్ద ప్రమాదం జరిగేది వరలక్ష్మి మరణించి ఉండేది కాబట్టి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న పంచాయతీ సెక్రటరీ (ఈవో)నీ తక్షణమే సస్పెండ్ చేయాలని సీ పీ ఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా జిల్లా కలెక్టర్ ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో రాధ లక్ష్మి జై కుమార్ మహేష్ రాజు శివ తదితరులు పాల్గొన్నారు