ఎవరు అడ్డొచ్చిన ఊరుకోం ఎస్సీ వర్గీకరణ అమలు కావాలి

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షలుగా సూరారం రాజు

Nov 29, 2024 - 19:00
 0  36
ఎవరు అడ్డొచ్చిన ఊరుకోం ఎస్సీ వర్గీకరణ అమలు కావాలి
ఎవరు అడ్డొచ్చిన ఊరుకోం ఎస్సీ వర్గీకరణ అమలు కావాలి

అడ్డగూడూరు 29 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై మాలల కుట్రలను తిప్పి కొడతాం ఎస్సీ వర్గీకరణపై రేంవత్ రెడ్డి మాదిగలను మభ్య పెట్టాలని చూస్తే ఊరుకొనేది లేదు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో ఏర్పాటు చేసిన ఎమ్మార్పిఎస్ మండల నూతన కమిటీ సమావేశానికి పడమటి సతీష్ మాదిగ అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథులుగా ఎంఎస్ పి ఉమ్మడి నల్గొండ జిల్లా కో-ఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా కో-ఆర్డినేటర్ బోడ సునిల్ మాదిగ ఎమ్మార్పిఎస్ అడ్డగూడూరు మండల కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునిస్తే తెలంగాణ రాష్టంలో రేంవత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయకుండా మాదిగలను మోసం చేస్తుంది రేంవత్ సర్కార్ పై మరో పోరాటం చేయడానికి మాదిగలు సిద్ధం కావాలని అన్నారు.మాల సామాజిక వర్గానికి చెందిన కొంత మంది నేతలు ఎస్సీ వర్గీకరణ జరగకుండా అడ్డుకుంటాం అని మాట్లాడుతున్న వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పి కొడతాం!ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బహిరంగ సభ వేదికలపై ఎస్సీ వర్గీకరణ న్యామమైన డిమాండ్ అని చెప్పిన రేంవత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో మాదిగలకు సమాధానం చెప్పాలని రేంవత్ రెడ్డి ప్రభ్యుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.. అనంతరం ఎమ్మార్పీఎస్ మండల నూతన కమిటీ ఎన్నిక అధ్యక్షులు సూరారం రాజు అధికార ప్రతినిధి పడమటి సతీష్ ప్రధాన కార్యదర్శి బాలెంల నరేష్, ఉపాధ్యక్షులు మందుల జానయ్య,కార్యదర్శి జిల్లా రాకేష్ ఈ కార్యక్రమం ఎం.ఎస్.పి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్రస్వామి మాదిగ సీనియర్ నాయకులు బట్ట శ్రీను బోడ యాదగిరి దర్శనాల సతీష్, బాలెంల మహేందర్, నెరిమల వెంకటేశ్వర్లు,ఉడుగు మల్లేష్, మందుల వెంకటేష్, పోలేపాక ఉపేందర్,గూడెపు హరికృష్ణ, బాలకృష్ణ మాదిగలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333