ఎల్ నీనో పై రైతులకి అవగాహన కార్యక్రమాం

Aug 1, 2026 - 22:07
 0  5
ఎల్ నీనో పై రైతులకి అవగాహన కార్యక్రమాం

 అడ్డగూడూరు 01 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామములో రైతులకి అవగాహన సదస్సు ఏవో పాండురంగచారి నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఈ సారి వర్షాలు సాధారణ వర్షపాతం కంటే తక్కువ ఉండే అవకాశం ఉన్నందున వరి సాగు తగ్గించి బెట్ట పరిస్థితులని తట్టుకొని  పంటలను ఎంపిక చేసుకుంటే రైతులు నష్టాలను తగ్గించుకోవచ్చని తెలియజేయడం జరిగింది.  ఈసారి మండలం లో వర్షం సాధారణం కంటే తక్కువ ఉన్నందున  మెట్ట పంటలైన  కందులు,సజ్జలు,జొన్నలు, కొర్రలు,కూరగాయలు, బంతి వంటి పూల తోటలు  వేసుకోవాలని తెలియజేయడం జరిగింది.చెరువులలో , బావులలో.బోరు బావులలో నీటి మట్టం క్రమంగా తగ్గుతుందల ఉన్నందున రైతులు ఆలోచన చేసి పంటల సరళి మార్చాలని తెలిజేయడం జరిగింది. కార్యక్రమంలో స్ధానిక  వ్యవసాయ అదికారి పి పాండురంగాచారి కోటమర్తి గ్రామ సర్పంచ్ పాశం విష్ణువర్ధన్ రావు,ఏఈఓ ఎస్ అక్షర గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333