ఎన్ హెచ్ ఎం కు  రావలసిన 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదలచేయాలి.

Mar 7, 2024 - 20:55
 0  1
ఎన్ హెచ్ ఎం కు  రావలసిన 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదలచేయాలి.

ఉద్యోగులకు తక్షణమే మూడు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలి 

 ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు డిమాండ్.

 ప్రతినిధి సూర్యాపేట:- నేషనల్ హెల్త్ మిషన్ కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లో తెలంగాణకు రావలసిన 1000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి మూడు నెలలుగా బకాయిలుగా పడి ఉన్న ఎన్ఎచ్ఎం ఉద్యోగుల జీతాలను వెంటనే విడుదల చేయాలని ఏఐటియుసి సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరై న ఏఐటీయూసీ  రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్న నేషనల్ హెల్త్ మిషన్ నందు పనిచేసే ఆల్ క్యాడర్స్,  రెండవ ఏఎన్ఎం లు, ఆర్ బిఎస్ కే సిబ్బంది  తో పాటు మొత్తం 17,000 మంది ఉద్యోగుల జీతాలను విడుదల చేయాలని ఏఐటియుసి రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా సూర్యాపేట  కలెక్టరేట్ ఎదురుగా  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన  జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ కాలంలో ఎన్ హెచ్ ఎం వ్యవస్థను నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న 60 : 40 వాటా ప్రకారం  కేంద్రం ఇస్తున్న 60 శాతం నిధులతో పాటు 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉండగా గత ప్రభుత్వం  కేటాయించలేదన్నారు.

  తద్వారా కావలసిన ఉద్యోగుల కంటే తక్కువ ఉద్యోగాలను నియమించుకోవడం జరుగుతుందని అందువల్ల ఎన్ హెచ్ ఎం లో పనిచేసే ఉద్యోగులకు తీవ్రమైన పని ఒత్తిడి ఉందన్నారు. ముఖ్యంగా రెండవ ఏఎన్ఎం లు 32 రకాల ఆప్ లను, 32 రకాల రికార్డులను నిర్వహించాల్సి వస్తుందన్నారు. వాస్తవానికి 2500 జనాభా కు ఒక ఏఎన్ఎం ఉండాల్సి ఉండగా గ్రామంలో 5000 జనాభా కు ఒక ఏఎన్ఎం,  పట్టణాలలో 20 వేల జనాభా కు ఒక ఏఎన్ఎం ఉంటుందన్నారు. దీని వల్ల పని ఒత్తిడి తీవ్రమవటం అవ్వడం వల్ల ఏఎన్ఎం లు రోజుకి 16 గంటల పని చేయాల్సి  వస్తుండటం వలన కుటుంబ సంరక్షణ చేసుకోలేక పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేతకాని తనం వల్ల రాష్ట్రానికి రావలసిన 1000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి ఆ బడ్జెట్ ను రాష్ట్రానికి తీసుకువచ్చి సమస్యల పరిష్కరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్బిఎస్ కే టీములలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎంలు, ఫార్మసిస్టులు రోజు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా వీరిపై అధ్యయనం చేసి వీరు పని ఒత్తిడి తగ్గించడంతోపాటు ప్రతినెల 1వ తేదీన జీతాలు చెల్లించటానికి కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మరిన్ని సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని వారు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్ రెండవ ఏఎన్ఎం జిల్లా కార్యదర్శి స్వప్న జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శులు రాధా సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు  యూనియన్ నాయకురాలు నీరజ శైలజ ఉమా చంద్రకళ గీత సరిత జయసుధ ఆల్ క్యాడర్ యూనియన్ నాయకురాలు సంధ్య సైదాచారి మహేష్. తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333