ఎంబిబిఎస్ స్టూడెంట్ సలీమా ను సన్మానించిన సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి

Sep 17, 2026 - 19:07
 0  1
ఎంబిబిఎస్ స్టూడెంట్ సలీమా  ను సన్మానించిన సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి

17-09-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామానికి చెందిన పింజరి సలీమ నోవ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ కాలేజీ హైదరాబాద్ లో MBBS సీటు సాధించడము జరిగింది.

 విషయం తెలుసుకున్న గూడెం గ్రామ సర్పంచ్ సలీమా ఇంటి దగ్గరికి వెళ్లి మిఠాయి తినిపిస్తూ సలీమాకు శాలువా కప్పి సన్మానించాడు.సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన సలీమా తల్లిదండ్రుల కష్టాన్ని జయించి, ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా చదువుకు ఆటంకం కావని నిరూపిస్తూ చదువుల తల్లి సలీమా అంటూ అభినందించాడు.అదే విధంగా ప్రతిరోజు పిల్లల కోసం కష్టపడుతూ జీవనాన్ని సాగిస్తున్న తల్లిదండ్రులను కూడ కూతురిని ఉన్నత చదువు చదివించినందుకు అభినందించాడు.

ఇకముందు కూడా గ్రామంలో సలీమ ను ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కొత్త వెంకటరెడ్డి తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది బాలకృష్ణ, సింగోటం బాలస్వామి,రాఘవేంద్ర, శ్రీనివాసులు, మేకల గోపాల్, మేకల కృష్ణయ్య, భయ్యా అంజి,, మల్లయ్య, శాంతయ్య,శివుడు తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State