బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి సహకరించాలి. 

Jun 10, 2026 - 19:53
 0  2
బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి సహకరించాలి. 

జోగులాంబ గద్వాల 10 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. బుధవారం ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినందున రాజకీయ పార్టీల నేతలు తమ వంతుగా సహాయ, సహకారాలు అందించాలని కోరారు. మృతి చెందిన ఓటర్లను, బోగస్  ఓటర్లను జాబితా నుంచి తొలగించడమే  కాక అర్హులైన ఓటర్లందరూ ఎలక్ట్రోరోల్ ఓటరు జాబితాలో ఉండేలా ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడం జరుగుతోందన్నారు. ఎస్ఐఆర్ పై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు తమ వంతుగా సహకారం అందించాలన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు తమ పరిధిలోని ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలను సేకరించడం జరుగుతుందన్నారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారి మంజుల, గద్వాల తహసిల్దార్ హరికృష్ణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333