ఉపాధ్యాయ పోస్ట్ లను భర్తీ చేయాలి ఉన్నత పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలి. సిపిఎం డిమాండ్

Jul 7, 2026 - 19:11
 0  1
ఉపాధ్యాయ పోస్ట్ లను భర్తీ చేయాలి ఉన్నత పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలి.  సిపిఎం డిమాండ్
ఉపాధ్యాయ పోస్ట్ లను భర్తీ చేయాలి ఉన్నత పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలి.  సిపిఎం డిమాండ్

 జోగులాంబ గద్వాల 7 జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, ఉన్నత పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. మంగళవారం ధరూరు మండలంలో దోర్నాల గ్రామంలోని ఏకోపాధ్యాయ పాఠశాలను, అల్వాలపాడు  ఉన్నత పాఠశాలను,మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోర్నాల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఒకే ఉపాధ్యాయురాలు ఉన్నారని,అన్ని రకాల సబ్జెక్టులు ఏ విధంగా బోధిస్తారని, పాఠశాలను ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నించారు. పాఠశాలకు కేటాయించిన భవనంలో అంగన్వాడి సెంటర్ సైతం నడుస్తుందన్నారు. ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫార్మ్స్, వర్క్ బుక్స్ రాలేదని తమ దృష్టికి తెచ్చినట్టు తెలిపారు. అల్లపాడు ఉన్నత పాఠశాలలో గత ఏడు సంవత్సరాలుగా తెలుగు ఇంగ్లీష్ బయోసైన్స్ హిందీ మాథ్స్ టీచర్లు, పిఈటి  లేరని ఎస్జీటీ , గ్రామస్తులు నియమించుకున్న విద్యా వాలంటీర్లతో చదువును కొనసాగిస్తున్నట్లు తమ దృష్టికి తెచ్చారన్నారు. పాఠశాలకు సొంత భవనం లేకపోవడం, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పాఠశాలలో చదివించడానికి ఆసక్తి లేక తల్లిదండ్రులు ప్రైవేటు విద్యాసంస్థలను ఆశ్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. బాలుర కు  వాష్ రూమ్ లో లేకపోవడం వల్ల బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక్కరూ కూడా లేరని విద్యార్థులకు ఆటలాడుకోవడానికి ప్రత్యేక క్రీడాస్థలం లేదని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత రెండు సంవత్సరాలుగా ఉపకార వేతనాలు పెండింగ్లో ఉన్నట్లు విద్యార్థుల తమ దృష్టికి తెచ్చారని అన్నారు. జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ లేకపోవడం వల్ల విష పురుగులు  సంచరిస్తున్నాయని దీనివల్ల విద్యార్థులకు ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. కళాశాలలో పిడి లేరని, విద్యార్థులు సంఖ్యకు అనుగుణంగా వాష్ రూమ్ కి లేకపోవడం వల్ల బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హమాలీ నర్సింహులు , దేవదాసు, మోష,తిమ్మప్ప,రాముడు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333