ఉపాధ్యాయుల సమస్యలపై శాసనమండలిలో గొంతుక నౌతా

వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యా ఎమ్మెల్సీ అభ్యర్థి జంగిటి కైలాసంను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి
టియుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రామినేని వెంకటేశ్వర్లు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి జంగిటి కైలాసం
వరంగల్, ఖమ్మం, నల్లగొండ, నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ ఉద్యమకారులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు జంగిటి కైలాసం ను ప్రభుత్వ అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రెసిడెన్షియల్ స్కూలు ఉపాధ్యాయులు, కేజీబీవీ ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ప్రైవేట్ అధ్యాపకులు, బ్యాలెట్ పేపర్ లోని సీరియల్ నెంబర్ 11లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టి యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రామినేని వెంకటేశ్వర్లు, ఆర్ వి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి జంగిటి కైలాసం కోరారు.జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు టి యుటిఎఫ్ ను 2011 సంవత్సరం లో ఏర్పాటు చేశామని చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గతంలో గెలిచిన వారు ప్రభుత్వం లో కలిసిపోయి ఉపాధ్యాయుల పిఆర్సీ, డిఏ, బకాయిలను మంజూరు చేయించడంలో విఫలమయ్యారని తెలిపారు. తనను గెలిపిస్తే ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యల ను ప్రభుత్వం, శాసన మండలి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు అంకిత భావం తో కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయ, అధ్యాపక మిత్రులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆయన వెంట అహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.