ఉద్యాన శాఖ కమిషనర్ ను కలసిన అధికారులు.
సూర్యాపేట జూన్ 13 :- రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమ కమిషనర్ ఎం డి యాస్మిన్ బాషా ను సూర్యాపేట జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య ఆధ్వర్యంలో అ శాఖ జిల్లా సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం నల్లగొండ పట్టణంలో జరిగిన బత్తాయి రైతుల సమావేశానికి విచ్చేసిన కమిషనర్ ను శాలువా తో సత్కరించి బోకే అందజేశారు. ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ ఈ సంవత్సరం సూర్యాపేట జిల్లా కు ప్రభుత్వం ఇచ్చిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యం పూరిచేయాలన్నారు. టీ జి ఆయిల్ ఫెడ్ సంస్థ ను సమానవ్యం చేసుకొని జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ను ప్రోత్సాహించాలని కోరారు. ఉద్యాన శాఖ పథకాలు క్షేత్ర స్థాయిలో తీసుకు వెళ్లి రైతులు రాయుతి లు సద్వినియోగం చేసుకొని పంట మార్పిడి చేయనుకునేలా కృషి చేయాలనీ అన్నారు.కమిషనర్ ను కలసిన వారిలో జిల్లా లోని ఉద్యాన అధికారులు కట్ట స్వాతి, ఎల్ ప్రదీప్తి, పి అనిత, వి. ప్రమిత, విస్తరణ అధికారులు రంగు ముత్యం రాజు, కట్టాగూరి రాము, వంగూరి అనిల్, అంకతి ప్రభాకర్, తదితరులు ఉన్నారు