వర్షాకాల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Jul 24, 2026 - 21:42
 0  1
వర్షాకాల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

జ్వరం మూడు రోజులకు మించి ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి

 ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి సీజనల్ వ్యాధులను అరికట్టాలి

జోగులంబ గద్వాల 24 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : వర్షాకాలంలో డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాలు,టైఫాయిడ్, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సంధ్యకిరణ్మయి సూచించారు.

శుక్రవారం మల్దకల్ మండల కేంద్రంలోని నిర్వహించిన “పొడి దినం” అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ,ఈ నెల 6వ తేదీ నుంచి ఎన్‌సీవీబీడీసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక జ్వర సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి జ్వర బాధితులను గుర్తించి వివరాలు సేకరిస్తున్నారని, అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి పరీక్షలు,చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రిలో అవసరమైన పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.జ్వరం మూడు రోజులకంటే ఎక్కువ కొనసాగితే డెంగీ పరీక్షలు, అనంతరం అవసరమైతే మలేరియా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడడం,నీటి నిల్వ పాత్రలకు మూతలు పెట్టడం, దోమతెరలు వినియోగించడం, పూర్తి శరీరాన్ని కప్పే దుస్తులు ధరించడం,కాచి చల్లార్చిన నీరు తాగడం,పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.వర్షంలో తడిసిన తర్వాత జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ముఖ్యంగా పిల్లల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం,అధిక జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
“చికిత్స కంటే నివారణే మేలు” అనే సందేశంతో ప్రతి మంగళవారం, శుక్రవారం “పొడి దినం” పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి దోమలు,ఈగలు పెరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. ప్రసూన రాణి, డీపీఎచ్‌ఎన్‌ఓ వరలక్ష్మి, స్థానిక వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333