ఉచిత పాలిటెక్నిక్ సెంటర్లో రెండో విడత మెటీరియల్ పంపిణి
విద్యార్థులు కష్టపడి చదివి మంచిర్యాంకులు సాధించాలి
తెలంగాణ వార్త కోదాడ, ఏప్రిల్ 21: అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (అస్క్), కోదాడ ఉచిత పాలిటెక్నిక్, టీజీ ఆర్జెసి కోచింగ్ సెంటర్ లో రెండో విడత స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని ఆస్క్ సభ్యులు స్థానిక ఎమ్మెస్ కళాశాలలో ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మాగి గురవయ్య, రిటైర్డ్ ఏపీజీవీబీ బ్రాంచ్ మేనేజర్ కుడుముల స్వామి దాసులు పాల్గొని మెటీరియర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు ప్రవేశ పరీక్షకు సమయం తక్కువ ఉన్నందున ఉపాధ్యాయులు చెప్పే అంశాలు జాగ్రత్తగా విని ఇంటిదగ్గర బాగా మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు తెచ్చుకొని మీకు నచ్చిన కోర్సు ఎంచుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ యలమర్తి శౌరి గారు, కోర్స్ కో-ఆర్డినేటర్ గంధం బుచ్చారావు, నందిపాటి సైదులు, చేకూరి రమేష్, అమరబోయిన వెంకటరత్నం, మేళ్లచెరువు వీరభద్రం, కనుకు శ్రీకాంత్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.