ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ

Mar 10, 2026 - 16:15
 0  162
ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ

 తిరుమలగిరి 10 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని నందాపురం గ్రామంలో పాడిపశువులకు మరియు దూడలకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వార్డ్ కౌన్సిలర్ కన్నెబోయిన మల్లయ్య  ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా 65 గేదెలకు దూడలకు మరియు 70 తెల్ల పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయడం జరిగినది .ఈ కార్యక్రమంలో రైతులు జక్కల లింగయ్య, చీమల మల్లయ్య ,మొగుళ్ళ మీనయ్య, కిష్టయ్య, నవీన్ లు మరియు పశు వైద్య సిబ్బంది ఇంచార్జ్ డాక్టర్ Drబత్తుల రవి, తాటిపాముల లైవ్ స్టాక్ అసిస్టెంట్(LSA) M స్వప్న, గోపాలమిత్ర సిహెచ్ సోమయ్య, కే రమేష్ లు పాల్గొనడం జరిగింది.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి