ఉచితంగా మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు
తిరుమలగిరి 01 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి స్వచ్ఛతా హి సేవ–2026 కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు నగర పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నందున, వారి ఆరోగ్యం, భద్రత మరియు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్ మల్లెల వందన ,కౌన్సిలర్స్ పనికర లక్ష్మి , కారు పోతుల సోమలక్ష్మి , తిరుమణి యాదగిరి , బత్తుల శ్రీనివాస్ , కన్నెబోయిన మల్లయ్య , భూక్య యాకూబ్ , కో ఆప్షన్ మెంబర్ దేశియా నాయక్ , మున్సిపల్ సిబ్బంది మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.