ఈ అమ్మాయిని హింసించి చంపడానికి ప్రయత్నించి

Apr 8, 2025 - 19:43
Apr 8, 2025 - 19:54
 0  3
ఈ అమ్మాయిని హింసించి చంపడానికి ప్రయత్నించి

  నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని గోశాల నాగారం ప్రాంతానికి చెందిన నేహా కౌసర్ (13) సంవత్సరాలు ఈ అమ్మాయిని హింసించి చంపడానికి ప్రయత్నించి బైంసాలో దొంగతనంగా ఆ పిల్ల చిన్నమ్మ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయిన సవతి తల్లి రిజ్వానా బేగం తండ్రి షేక్ హుస్సేన్ .

(యాంకర్ బైట్) నేహా కౌసర్ పుట్టి 13 సంవత్సరాలు కావస్తుంది... గత ఐదు సంవత్సరాల క్రితం నేహా కౌసర్ తల్లి ఐమదీ వేగం ఆరోగ్యం బాగాలేక మృతి చెందింది.... అనంతరం షేక్ హుస్సేన్ భార్య చనిపోయిన కొన్ని రోజులకే రిజ్వానా బేగం ను వివాహం చేసుకున్నాడు..... అప్పటినుండి వచ్చిన సవతి తల్లి, తండ్రి షేక్ హుస్సేన్ ఆ అమ్మాయిని ఇంటి చాకిరిని చేపిస్తూ పొద్దున 5 గంటలకి లేపి బోలు తోమడం, బట్టలు ఉతకడం, వారికి పుట్టిన పిల్లలను చూసుకోవడంతో పాటు వారికి పాఠశాలకు వదిలిపెట్టి రావడం, వంట చేయడం తో పాటు అనేక పనులు చేయించి క్షీణించిపోయేలా చేశారు.......

వాయిస్ ఓవర్: నేహా కౌసర్ తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ 

..... ఆమె సవతి తల్లి, ఆమె తిండి తినాలంటే రాత్రి పాచిపోయిన అన్నం తినిపించడం అదేవిధంగా తినకపోతే కొట్టడం దినమంతా తల్లి బెల్టుతో కొట్టడం, మళ్లీ తండ్రి వచ్చిన అనంతరం చిత్రహింసలు పెట్టి కొట్టడం, అంతేకాకుండా గోడకు తలకాయ వేసి కొట్టడం, అలాగే మెడ గట్టిగా ఒత్తిపెట్టి పైకి లేపడం మొత్తానికి చంపేసే ప్రయత్నం చేయడం చేశారని నేహా కౌసర్ తెలిపింది.... ఈ ఘటన బైంసా ఏరియా ఆసుపత్రిలో ఈరోజు చికిత్స పొందుతూ ఆమె మాట్లాడటం జరిగింది....... ఆసుపత్రిలో స్వయంగా ఆమె మాటల్లోనే చెప్పడం జరిగింది.... నేహా కౌసర్ కు ప్రస్తుతం పసిరికాయలు కావడంతో అలాగే శరీరంలో రక్తం లేకపోవడంతో చనిపోతదన్న భయంతో సవతి తల్లి తండ్రి షేక్ హుస్సేన్ ఇద్దరు ప్లాన్ ప్రకారం బైంసా లో ఉన్న వారి చిన్నమ్మ ఇంటికి వద్ద కొంత దూరంలో దొంగతనంగా వదిలిపెట్టేసి పారిపోయారు.... ఈ విషయంపై నేహా కౌసర్ తండ్రి షేక్ హుస్సేన్ ను ఫోన్లో వివరణ అడిగితే నా పిల్ల నేను చంపుకుంటాను ఉంచుకుంటాను మీకెందుకు అని చెప్పేసి మైనర్ బాలికకు ఇలా చేయడం చాలా సమాజంలో సిగ్గుచేటుగా మారిందని చెప్పవచ్చు ఎందుకంటే ఆమె ఆడపిల్లగా పుట్టడం తప్ప, సమాజంలో ఆడపిల్లకి బతికే హక్కు లేదా అందుకేనా ఈ అన్యాయం ఆమె తల్లి చనిపోయిన కొన్ని రోజులకే తర్వాత చేసుకున్న సవతి తల్లి అలాగే తండ్రి ఈమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చాలా బాధాకరంగా ఉంది అని చెప్పేసి బాధితులను నేహ కౌసర్ ఆమె మాటల్లో ఏడుస్తూ ఆసుపత్రిలో వీడియో ద్వారా తెలియజేసింది... ఈ నేహా కౌసర్ ను చంపడానికి ప్రయత్నించిన సవతి తల్లి, తండ్రి షేక్ హుస్సేన్, నానమ్మ, భాను వేగం ను చట్ట ప్రకారం శిక్షించి నాకు బ్రతికించాలని అందరినీ వేడుకుంటుంది.... ఆమె తండ్రి షేక్ హుస్సేన్ తోటి ఫోన్లో మాట్లాడితే... ఏం జరిగితే నాకేం చేసేది లేదని బ్రతికితే బ్రతుకుతుంది లేకపోతే చనిపోతుంది అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.... అదేవిధంగా నాకు ఒరిగేది ఏమీ లేదు అంటూ చేతులు ఎత్తేస్తున్నాడు కాబట్టి ఇలాంటి తల్లి లేని పిల్లకి న్యాయం జరిగేలా అటు పోలీసు శాఖ వారు అటు బాల కార్మికుల సంఘం అధికారులు వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని నేహా కౌసర్ కోరుతుంది.... అలాగే నేను ఆడపిల్లనని న్యాయం చేసి బతికించాలని లేనియెడల ఆమె చనిపోయే అవకాశం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు .... కాబట్టి మానవత్వంగా ఆలోచించి ఇలాంటి దిక్కులేని ఆడపిల్లలకు తక్షణమే ఆదుకోవలసిన బాధ్యత సమాజంపై ఉందని నేరం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేహా కౌసర్ కోరుతుంది..

బైట్: నేహా కౌసర్ గోశాల నాగారం నిజాంబాద్ జిల్లా

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333