ఈనెల 16 నే నిమజ్జనo .. ఎలాంటి మినహాయింపు లేదు.
*ఈ నెల 16నే నిమజ్జనం... ఎలాంటి మినహాయింపు లేదు*..
*మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించిన ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ రవి, ఆయా శాఖల అధికారులు*
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్న భక్తులు ఈ నెల 16నే గణేష్ నిమజ్జనోత్సవం చేయాలని ఎవరికి ఎలాంటి మినహాయింపు లేదని. ఆర్డీఓ వేణు మాదవరావు, డీఎస్పీ రవి, మున్సిపల్ కమీషనర్ బి. శ్రీనివాస్ లు సూచించారు. ఈ నెల 16న గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్లను మంగళవారం స్థానిక సద్దులు చెరువు మినీ ట్యాంక్ బండ్‌పై పరిశీలించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 400ల విగ్రహాల వరకు ఉండడంతో మూడు పెద్ద క్రైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గణేష్ శోభాయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను కూడా రూపొందించడం జరిగిందని అన్నారు. నిమజ్జనం సందర్భంగా రోడ్లపై గుండలను పూడ్చడం, లైటింగ్ ఏర్పాటు చేయడం, చెరువు ఆవరణలో రెడ్ మీక్స్ పోయడంతో పాటు ఎలాంటి అపశృతులు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యాంసుందర్, పట్టణ సీఐ రాజశేఖర్, ఇరిగేషన్ డిఇ రమేష్, ఎఇ పాండు, వర్క్ ఇన్స్పెక్టర్ బాలాజీనాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కెక్కిరేణి శ్రీనివాస్, రంగరాజు రుక్మారావులతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.