యువత వ్యసనాలకు లోను కావద్దు సూర్యాపేట జిల్లా ఎస్పీ

Sep 10, 2024 - 20:47
Sep 10, 2024 - 21:09
 0  8
యువత వ్యసనాలకు లోను కావద్దు సూర్యాపేట జిల్లా ఎస్పీ

యువత వ్యసనాలకు లోనుకావద్దు. సూర్యాపేట జిల్లా ఎస్పీ

తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా ప్రతినిధి

- డ్రగ్స్ అలవాటు చేయడానికి ప్రయత్నం చేసే వారి నుండి దూరంగా ఉండాలి.

- యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.

- డ్రగ్స్ మత్తుతో జీవితం నాశనం అవుతుంది.

- డ్రగ్స్ వినియోగించిన, రవాణా చేసిన శిక్షలు తప్పవు.

సూర్యాపేట జిల్లా పోలీసుల అధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట పట్టణం, SV డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నందు డ్రగ్స్ నిర్మూలన పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్  ముఖ్య అతుగా హాజరై విద్యార్థులతో మాట్లాడినారు. డ్రగ్స్ నిర్మూలనలో యువత ప్రాధాన్యతను గురించి వివరించారు. ఎస్పి మాట్లాడుతూ యువత, విద్యార్థులు దేశ సంపద, దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉన్నది కావున విద్యార్థుల్లో, యువతలో మార్పు రావాలి, డ్రగ్స్ నిర్మూలన కోసం బాధ్యతగా ఉండాలి అని కోరారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలలో యాంటీ డ్రస్ టీమ్స్ ఏర్పాటు చేశాము, విద్యాసంస్థల్లో ఈ టీమ్స్ డ్రగ్స్ నిర్మూలనకు పని చేయాలి, అధికారులకు సమాచారం అందించాలి అన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది, మంచి భవిష్యత్తును కోల్పోతారు అన్నారు. సమాజంలో చెడ్డపేరు వస్తుంది అన్నారు. గంజాయి, కొకైన్, హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాల వల్ల అన్ని కోల్పోతారు అన్నారు, ఇది మన దేశ యువ శక్తిని నిర్వీర్యం చేస్తుంది అన్నారు. డ్రగ్స్ వినియోగం, రవాణా, సరఫరా చేయడం తీవ్రమైన నేరం అన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడిన విద్యార్థులు, యువత గురించి సమాచారం ఇవ్వండి వీరికి కౌన్సిలింగ్ ఇస్తాము, వీరిలో మార్పునకు కృషి చేస్తాము అన్నారు. మన సమాజంలో డ్రగ్స్ లేకుండా నిర్మూలించడం మన అందరి బాధ్యత అన్నారు. డ్రగ్స్ తీసుకుంటే చదువులో, పరీక్షల్లో చురుకుగా ఉంటారు అని మభ్య పెడతారు ఇలాంటివి అస్సలు నమ్మవద్దు, మత్తులోకి దింపి జీవితం నాశనం చేస్తారు అని గ్రహించాలి అన్నారు. విద్యార్థులు వీటికి దూరంగా ఉంటారు అని నమ్మకం ఉన్నది, డ్రగ్స్ వల్ల సమాజంలో జరిగే అనర్ధాలు, నేరాలు, దాడులు లాంటివి నిర్మూలించడంలో విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలి అని అన్నారు. డ్రగ్స్ కు అలవాటు చేసి నేరాలు చేయడానికి ప్రోత్సహిస్తారు కావున అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సైబర్ నేరాలు అనేవి ఇప్పుడు సమాజంలో మరో పెద్ద సమస్య అని అన్నారు, సైబర్ నేరగాళ్లు ఉచితాలు ఆశలు చూపి ఆర్థికంగా నష్టపరుస్తారు, OTP లు, పిన్ నంబర్స్ చెపితే బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు పోతాయి అన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ లో సంప్రదిస్తే వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు అని ఎస్పి కోరారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పోలీసు కళాబృందం వారు డ్రగ్స్ నిర్మూలన, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో DSP రవి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, SV కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు గారు, ఉత్తమ ఉపాద్యాయులు రమేష్, SI లు, కళాశాల విద్యార్థులు, ఉపాద్యాయులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223