ఇసుక ట్రాక్టర్ ను పట్టుబడి చేసిన ఎస్సై డి నాగరాజు

Jan 5, 2025 - 23:41
Jan 5, 2025 - 23:50
 0  128
ఇసుక ట్రాక్టర్ ను పట్టుబడి చేసిన ఎస్సై డి నాగరాజు

అడ్డగూడూరు 05 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని డి రేపాక గ్రామంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వ్యక్తిని మరియు ఒక ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు వివరాల్లోకి వెళితే డి రేపాక గ్రామానికి చెందిన రవిరాజు తండ్రి సోమరాజు అనే వ్యక్తి అడ్డగూడూరు మండల పరిధిలో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా తన యొక్క ట్రాక్టర్ యొక్క నెంబర్ TS 30ఈ 4069 సోనాలిక ట్రాక్టర్ ట్రాలీ నెంబర్ టీఎస్ 30జి 6915 గల ట్రాక్టర్ నందు మూసి వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా సమాచారం మేరకు అక్కడికి వెళ్లి వ్యక్తిని వారి ట్రాక్టర్ర్స్ ను పట్టుబడి చేసి అట్టి వ్యక్తులపై కేసు నమోదు చేసి ట్రాక్టర్స్ ను సీజ్ చేయడం జరిగిందని ఎస్ఐ నాగరాజు తెలిపారు.