ఇన్సూరెన్స్ పాలసీ కాకుండా పెన్షనర్స్ ప్లాన్ గా మార్చారు
ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ ఎదుట బాధితుడి ఆవేదన
సూర్యాపేట:హుజుర్ నగర్ ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ ఆఫీస్ లో ఐదు సంవత్సరాలకు గాను ఏడాదికి ఆరు లక్షల చొప్పున 30 లక్షల పాలసీని కట్టానని ఈ ఏడాది ఆగస్టు నెలలో టర్మ్ పాలసీ ముగిసిందని, కట్టే సమయంలో అదనంగా మూడు లక్షల 44 వేల రూపాయలు వస్తాయని ఇప్పుడు అలా కాకుండా ఇన్సూరెన్స్ పాలసీ కాకుండా పెన్షన్ ప్లాన్ గా మార్చారని హుజూర్ నగర్ కు చెందిన ఎస్ బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఖాతాదారుడు బోనాల నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రం ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టర్మ్ పాలసీ ముగిసిన ఏడాదికి గత సంవత్సరం ఆగస్టు 19 2025న ముగిసిన ఏడాదికి 20 లక్షలు రూపాయలు ఇచ్చారని మిగతా 13 లక్షల 44వేల రూపాయలు పెన్షన్ గా నెలకు 7వేల రూపాయలు జీవితాంతం పాలసీదారుడుకి, అనంతరం నామినీకి వస్తాయని చెప్పారని తెలిపారు. తనలాగా ఏ పాలసీదారుడు అన్యాయానికి గురి కావద్దని ఆలోచించి పాలసీలలో చేరాలని విజ్ఞప్తి చేశారు. తన పాలసీని పెన్షనర్ ప్లాన్ కాకుండా ఇన్సూరెన్స్ పాలసీగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.
వివరణ
ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని ఇప్పుడు మార్చడానికి అవకాశం ఉండదని మెయిల్ తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయాలని ఎస్ బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ సూర్యాపేట ఏరియా మేనేజర్ సతీష్ తెలిపారు.