ఇందిరమ్మ ఇండ్లలో ధరకాస్తు పెట్టుకున్న వికలాంగులకు మొదట ప్రాధాన్యత కల్పించాలి

Jun 6, 2025 - 19:05
 0  17
ఇందిరమ్మ ఇండ్లలో ధరకాస్తు పెట్టుకున్న వికలాంగులకు మొదట ప్రాధాన్యత కల్పించాలి

భువనగిరి 06 జూన్ 2017 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువన జిల్లా ఎన్ పి ఆర్ డి  జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు పేద ప్రజలకు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా వికలాంగులకు ఐదు శాతం ఇవ్వాలని ఉన్నది కానీ ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వికలాంగులు ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తు పెట్టుకొని ఆ దరఖాస్తు పరిశీలన అయిన తర్వాత పేరు వచ్చిందని చెప్పి ఆ తర్వాత ఆ ఇండ్ల లో పేరు లిస్టులో నుండి  తొలగించడం జరిగింది, ఇది దుర్మార్గం అన్యాయం  పేదలంటే వికలాంగులు కారా వికలాంగులు పేదలగా కనపడతలేరా వికలాంగులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి అని మంతులు చెపుతుంటే, అధికారులు మాత్రం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. వికలాంగులు ఇల్లు లేక కట్టుకుంటామని అప్లికేషన్ పెడితే పేరు తొలగించడం ఎంత దుర్మార్గము ఇది ఎన్ పి ఆర్ డి  వికలాంగుల సంఘం సహించబోదు ఎందుకంటే మా వాటా  మాకు ఇవ్వండి మేము గొంతెమ్మ కోరికలు కోరటలేము  అరులైన వికలాంగులకు  ఇల్లులు కట్టియాలి,స్థలం లేనివారికి ఇండ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇయ్యాలీ ఇప్పటికీ స్థలం ఉండి గుడిసెలు  వేసుకొని వర్షం వచ్చినా గాలి దుమారం వచ్చిన ఇబ్బంది పడుతున్నరూ ఈ ప్రభుత్వం వచ్చింది ఆదుకుంటది ఇల్లు ఇస్తామని చెప్తే మాకు అదృష్టం వచ్చింది మాకు ఇల్లు కట్టిస్తుంది అనుకున్నాం కానీ ఇండ్లుకు పెట్టుకున్న అప్లికేషన్లు తొలగిస్తుంటే ఈ అధికారులు ప్రభుత్వం ఏమనాలో అర్థం కాకుండా పోతుంది ఇప్పటికి ప్రభుత్వం కనులు తెరిచి ఆమె ఇచ్చిన వెంటనే ఇవ్వాలి   పేద వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం సన్న బియ్యం ఉపాధి కోసం లోన్లు ఇస్తాం మీ పిల్లలకు విద్య వైద్యం అందిస్తాం చెప్తుంది కానీ  చెప్పిన మాటల్లో పేదవాలుగా వికలాంగులు కనిపిస్తలేరా వీళ్లకు  సన్న బియ్యం ఇవ్వొద్దా వికలాంగులు సన్న బియ్యం తినొడ్డ అంతోదయ రేషన్ కార్డులు 35 కిలలు బియ్యం   వికలాంగులకు ఉపాధి అవకాశాల్లో లోన్లు అవకాశం  కల్పించలీ  వికలాంగుల పిల్లలు చదువుకుందాం అంటే స్కూల్ లేక ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోవాలంటే ఇబ్బంది పడుకుంటూ వాళ్లకు విద్య వైద్యం అందించొద్దా వాళ్ళ పేదలు కాదా ఇదేనా మీ ప్రభుత్వం చేసేది ఇదేన  పాలకుల పరిపాలన ఎన్ పి ఆర్ డి  వికలాంగుల సంఘం సహించబోదు,అందుకే ఇప్పటికైనా ప్రభుత్వాలు పాలకులు కన్నులు తెరిచి మొదటి ప్రాధాన్యత కల్పించి వెంటనే వికలాంగుల అప్లికేషన్ పెట్టిన వారికి వెంటనే ఇండ్లు మంజూరు చేయాలని. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అమలు చేయక పోతే  రాకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలను ఎక్కడె కెక్కడ వాళ్ళని అడ్డు కుంటము.ఎమ్మెల్యే ఎంపీ  ఇండ్లను  ముట్టడిస్తామ.యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు.ఇందిరమ్మ ఇండ్లు  దరఖాస్తు పెట్టుకున్న వారి పేర్లు బొంత ఎల్లయ్య గ్రామం మాసనపల్లి మండలం గుండాల జోగు హేమలత కొరటికల్ మండలం ఆత్మకూరు గౌటి మల్లేష్ గ్రామం గోకారం వలిగొండ మండలం అంశమ్మ గ్రామం చిమిర్యాల  నారాయణపురం మండలం వీలే కాదు జిల్లాలో అన్ని మండలాల్లో దరఖాస్ పెట్టుకొని పేర్లు తొలగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకోసం అందరూ కూడా ఇండ్లు రావాలని తక్షణమే అమలు చేస్తారని డిమాండ్  చేయాలని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333